Ad Code

పారిశ్రామిక మర మనిషి



ర మనిషి (రోబో) ఈ పేరు వినగానే రజనీకాంత్‌ సినిమా గుర్తుకు వస్తుంది. దానిలో మర మనిషి అనేక విన్యాసాలు చేస్తుంది. అలాగే టివిలో వచ్చే కార్ల, కంప్యూటర్ల ప్రకటనల్లో కూడా మర మనిషిని చూస్తున్నాము. అవి మనల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
భారీ పరిశ్రమల్లో అతి క్లిష్టమైన పనులను చేయడానికి 50 సంవత్సరాల క్రిందటే మర మనిషిని వాడేవారు. అయితే మనిషి రూపంలో మర మనిషి వుండకపోవచ్చు. మనిషి కూడా చేయలేని పనులను కూడా సునాయాసంగా ఈ మర మనిషి చేయగలుగుతున్నాడు. ప్రస్తుతం భారీ పరిశ్రమల్లో రోబోట్లు వాడకం సర్వసామాన్యమైంది.
1960లో జార్జ్‌ ఛార్లెస్‌ డేవోల్‌ (జూనియర్‌) అనే శాస్త్రవేత్త మొట్ట మొదట ఈ పారిశ్రామిక మర మనిషిని డిజైన్‌ చేసి రూపొందించాడు. ఎంజెల్‌ బెర్జర్‌ సహకారంతో డేవోల్‌ తయారు చేసిన మొట్ట మొదటి రాబోట్‌ను జనరల్‌ మోటార్స్‌కు విక్రయించారు. 1961లో డేవోల్‌ ఫ్యాక్టరీ నుండి 'యునిమేట్‌' అనే పేరుతో తొలి పారిశ్రామిక మర మనిషిని తయారుచేశారు. దానిని న్యూజెర్సీలోని జనరల్‌ మోటారు ఫ్యాక్టరీలో ఇన్‌స్టాల్‌ చేశారు. దానితో ఫ్యాక్టరీలో ఆటోమేషన్‌కు తెర తీయడం జరిగింది. ఆ తరువాత అనేక పరిశోధనలు చేసి డిజైన్‌లో వున్న లోపాలను సరిచేసిన మరింత మెరుగుపర్చి 1966 నుండి డేవోల్‌ పూర్తిస్థాయి రోబోలను ఉత్పత్తి చేయడం ప్రారంభించాడు.
న్యూజెర్సీలో ఇన్‌స్టాల్‌ చేయబడిన తొలి రోబోను డై-కాస్టింగ్‌ మెషిన్‌ నుంచి ఎర్రగా కాల్చిన ఇనుప ప్లేట్లన తీసి దొంతరగా పేర్చడానికి వినియోగించారు.


Post a Comment

0 Comments

Close Menu