Header Ads Widget

డ్రైవర్స్‌
ఏదైనా ఒక ఉపకరణం కంప్యూటర్‌ సంబంధాన్ని ఏర్పరుచుకొని డేటాని ట్రాన్స్‌ఫర్‌ బదిలీ చేసే సాఫ్ట్‌వేర్‌.
యుఎస్‌బి
యూనివర్షల్‌ సీరియల్‌ బస్‌ (యుఎస్‌బి) పిసికి ఇతర ఉపకరణాలను కలుపుకొనేందుకు వీలు కల్పించేందుకు ఫోర్ట్‌.
స్పామ్‌
స్పామ్‌ని చెత్త అని కూడా అనవచ్చు. అంటే మనకు పనికిరాని సంక్షిప్త సమాచారాన్ని పంపేది.
రిజిస్ట్రీ
విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్‌ అయ్యే ప్రతీ సాఫ్ట్‌వేర్‌ లేదా హార్డ్‌వేర్‌ సమాచారాన్ని కలిగివుండే దానిని రిజిస్ట్రీ (డేటాబేస్‌) అంటారు.
పైర్‌వేర్‌
డిజిటల్‌ కెమెరా, రికార్డర్లు మొదలగు ఉపకరణాలకు, పీసీలకు మధ్య సంబంధాన్ని ఏర్పరచి, వేగంగా డేటా ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి వీలునిచ్చే సూపర్‌ఫాస్ట్‌ డేటా లింక్‌.
స్పైవేర్‌
ఏదైనా సాఫ్ట్‌వేర్‌ మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకునేటప్పుడు దానితోపాటు ఇది కూడా మనకు తెలియకుండా ఇన్‌స్టాల్‌ అయి ఆ సాఫ్ట్‌వేర్‌ సంస్థకు మన సమాచారాన్ని తెలియజేసేది.
ఫర్మ్‌వేర్‌
హార్డ్‌వేర్‌ తయారుచేసే వారు దానికి సంబంధించిన సూచనలను రోమ్‌ మెమెరీలో వుంచి పనిచేసేటట్లు చేయడానికి ఫర్మ్‌వేర్‌ అంటారు.
సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌
సిస్టమ్‌ను పనిచేయించడానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ అంటారు.
అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌
సిస్టమ్‌లోని అప్లికేషన్స్‌ను పనిచేయించడానికి వాడేదే అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌.
హార్డ్‌వేర్‌
సిస్టమ్‌లోని భాగాలు మదర్‌బోర్డు, ప్రాసెసర్‌, హార్డ్‌డిస్క్‌, కీబోర్డు, మౌస్‌ మొదలగువాటిని హార్డ్‌వేర్‌ అంటారు.

Post a Comment

0 Comments