Ad Code

ఎంఎస్‌ ఆఫీస్‌కు ధీటుగా ఓపెన్‌ ఆఫీస్‌




ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ వాడే వారికి ఈ పదం సుపరిచయమే. గతంలో వర్డ్‌ ప్రాసెసింగ్‌ కోసం వర్డ్‌ స్టార్‌ను, డేటాబేస్‌ కోసం డిబేస్‌ను, స్ప్రెడ్‌షీట్‌ కోసం లోటస్‌ సాఫ్ట్‌వేర్‌లను వాడేవారు. ఆ తరువాత క్రమంలో మైక్రోసాఫ్ట్‌వేర్‌ వీటన్నిటినీ కలిపి సాఫ్ట్‌వేర్‌ సూట్‌గా (ఎంఎస్‌ ఆఫీస్‌) విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేసేలా రూపొందించారు. ఓపెన్‌సోర్స్‌, ఫ్రీసాఫ్ట్‌వేర్‌ ఉద్యమాల ఫలితంగా ఎంఎస్‌ ఆఫీస్‌కు ధీటుగా ఈరోజు ఓపెన్‌ ఆఫీస్‌ వాడుకలోకి వచ్చింది. ఇది అన్ని ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేస్తుంది. లైనెక్స్‌తో అయితే ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పాటు దీనిని ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. మిగతా ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌లో అయితే విడిగా ఇన్‌స్టాల్‌ చేసుకోవలసి వుంటుంది.
ఓపెన్‌ ఆఫీస్‌లో రైటర్‌ అనే పేరుతో పనిచేసే వర్డ్‌ ప్రాసెసర్‌లో మల్టీ పేజీ డిస్‌ప్లే, మల్టీ లింగువల్‌ సపోర్ట్‌, వెస్‌ కోసం వికీ డాక్యుమెంట్లను ఎడిట్‌ చేసే సామర్థ్యం వుంది. డ్రా అనే పేరుతో గ్రాఫిక్‌లను డిజైన్‌ చేసుకోవచ్చు. ఇంప్రెస్‌లో ప్రెజెంటేషన్‌లలోనే టేబుల్స్‌ను డిజైన్‌ చేసుకోవచ్చు. వర్డ్‌ ప్రాసెసింగ్‌ రూపొందించిన డాక్యుమెంట్లను నేరుగా పిడిఎఫ్‌గా మార్చుకోవచ్చు. ఇంప్రెస్‌లో రూపొందించిన పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ప్లాష్‌ ప్లేయర్‌లో పనిచేసే ప్లాష్‌ ఫైల్‌గా సేవ్‌ చేసుకోవచ్చు.

ది 40 భాషాలలో వాడుకోవచ్చు. 40 భాషలలో స్పెల్‌ చెక్‌, డిక్షనరీ ఏర్పాటు వుంది. చూడడానికి, వాడటానికి ఎంఎస్‌ ఆఫీస్‌ కన్నా ఎంతో మెరుగ్గా వుంటుంది. డ్రా అనే వెక్టర్‌ గ్రాఫిక్‌ సాఫ్ట్‌వేర్‌ దీనిలో ఒక ప్రత్యేకత. ఇది ఎంఎస్‌ ఆఫీసులో లేదు.


Post a Comment

2 Comments

  1. open office లాంటి మంచి free softwares ని వాడక పోవటానికి కారణం పిరసీయే కారణం. ఏదైనా free గ వస్తుండడం వల్ల msoffice నే ఎక్కువగా వాడుతున్నారు.పిరసీయే వీటికి పాపులారిటీ తెచ్చిపెడుతుంది., school స్దాయి నుంచే paint, msoffice,లాంటి Microsoft ఉత్పత్తులు నేర్పడం B.Sc(computers), B.Tech, or PGDCA లాంటి profficinal corses లో కూడా microsoft ఉత్పత్తులు వుండటం వల్ల students అందరు కూడా వీటికే అలవాటు పడుతున్నారు.ముందు university, కాలేజీ,ఇన్స్టిట్యూట్ వీటన్నింటిలో మార్పు వస్తే కానీ ఓపెన్ సోర్స్ విప్లవం మరింత పుంజుకోలేదు.

    ReplyDelete
Emoji
(y)
:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
:>)
(o)
:p
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
x-)
(k)

Close Menu