Ad Code

ఎలక్ట్రోలాజికా కంప్యూటర్‌ వారి ప్రయోగాలు విజయవంతం






యుద్ధ సమయాలలో శత్రువలపై పైచేయి కోసం వివిధ దేశాలు రకరకాల ప్రయోగాలు చేస్తుంటాయి. యుద్ధం తర్వాత అవి మామూలు జనాల ప్రయోజనాల కోసం వినియోగించబడుతూవుంటాయి. మనము ఇప్పుడు చూస్తున్న కంప్యూటర్ల అనేక మంది శాస్త్రవేత్తల కృషి వుందంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ప్రయోగాల కోసం కొన్ని ప్రయోగాత్మకంగా రూపొందించబడి వుండవచ్చు. వారి ప్రయోగాలు విజయవంతం కాకపోయినా ఆ విధంగా తయారయ్యిన కంప్యూటర్ల వల్ల ప్రయోజనాలు అనేకం. భావి శాస్త్రవేత్తలు ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి అవి ఉపయోగపడ్డాయి. నేటి కంప్యూటర్ల వృద్ధికి పునాదురాళ్లయ్యాయి.
కంప్యూటర్లంటే మనకు ఠక్కున గుర్తుకు వచ్చేది అమెరికా. కానీ అమెరికా లేదా బ్రిటన్లే ఈ కంప్యూటర్లను రూపొందించలేదు. వీటి వెనుక యూరోపియన్‌ దేశాల కృషి కూడా వుంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ మిలటరీ అవసరాలకే కాక సాంకేతికంగా ఎదిగి ప్రత్యర్థుల మీద అన్ని విధాల పైచేయి సాధించడానికి విదేశీ శాస్త్రవేత్తలను కిడ్నాప్‌చేసి వ్యూహరచనలలో, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో శక్తివంతమైన కంప్యూటర్లను రూపొందించేందుకు ప్రయత్నించిందని చరిత్ర చెబుతోంది. యూరోపియన్‌ దేశమైన నెదర్లాండ్‌ శాంతియుత ప్రయోజనాల కోసం ఎలక్ట్రోలాజికా అనే కంప్యూటర్‌ను తయారుచేసింది.
నెదర్లాండ్‌కు చెందిన ఆరుగురు శాస్త్రవేత్తలు (నలుగురు గణిత శాస్త్రవేత్తలు, ఒకరు జీవశాస్త్ర శాస్త్రవేత్త, ఒకరు భౌతికశాస్త్ర శాస్త్రవేత్త) కలిపి 1947లో ఒక రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి శాంతియుత వాతావరణం ఏర్పడటంతో శాస్త్రవేత్తలు పరిశోధనలపై దృష్టి సారించారు. అప్పట్లో కంప్యూటర్లు అంతగా లేనప్పటికీ వాటి ప్రయోజనాలు గుర్తించడంతో వాటిని రూపొందించడానికి ఉద్యుక్తులైయ్యారు. 1958 నాటికి డచ్‌ వారు పూర్తి స్థాయిలో డిజిటల్‌ కంప్యూటర్‌ను ఎలక్ట్రోలాజికా టెన్‌ 1 పేరుతో మార్కెట్‌కు విడుదల చేశారు. కంప్యూటర్‌ పనిచేస్తుండగా హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌పరంగా వచ్చే ఎర్రర్లను ఇంట్రప్టెడ్‌ అనేవారు. అప్పటి కంప్యూటర్లలో మెమోరీ వుండేదికాదు. వీటిలో ర్యామ్‌, రోమ్‌ వుండేవి అప్పట్లో వీటిని ర్యామ్‌ను లైవ్‌ మెమోరీగా, రోమ్‌ను డెడ్‌ మెమోరీగా పిలిచేవారు. ఇది సైన్‌ బిట్‌ మరియు ప్యారిటీ బిట్‌తో కలిపి 28 బిట్స్‌ గల 512 వర్డ్స్‌ని లైవ్‌ మెమోరీలో స్టోర్‌ చేసుకోగలిగేది. అదే విధంగా 700 వర్డ్స్‌ని డెడ్‌ మెమోరీలో స్టోర్‌ చేసుకోగలిగేది. ఇవికాకుండా మోమోరీని పెంచడానికి ప్రత్యేక స్టోరేజ్‌ కేబినెట్‌లుండేవి. డ్రమ్‌, డిస్క్‌ వంటి సెకండరీ స్టోరేజ్‌లు లేనప్పటికీ మేగటిక్‌ డ్రవ్‌లను ఆప్షనల్‌ జోడించడానికి వీలుండేది. ఈ కంప్యూటర్లు ట్రాన్సిస్టర్స్‌ ఆధారంగా పనిచేసేవి కాబట్టి అవి పనిచేసేటప్పుడు ఎక్కువ వేడి ఉద్భవించేదికాదు. అందువలన వీటికి ఎసిల అవసరం వుండేది కాదు.

Post a Comment

0 Comments

Close Menu