Ad Code

వెబ్‌క్యామ్‌





నేడు కంప్యూటర్‌ వాడకం సర్వ సాధారణమైంది. దానితో పాటు ఇంటర్నెట్‌ వాడకం కూడా మన దేశంలో బాగా పెరిగిపోయింది. ఐడి కార్డులు, ట్రాఫిక్‌ నియంత్రణ, షాపులలో చోరీల నియంత్రణ.... ఇలా అనేక రకాలుగా ఈ వెబ్‌ కెమెరాలు ఉపయోగపడుతున్నాయి. దేశ, విదేశాలలో వున్న మన స్నేహితులతో డైరెక్ట్‌గా మాట్లాడే సౌకర్యం వుండటంతో వెబ్‌క్యామ్‌కు గిరాకీ పెరిగింది.
లో క్వాలిటీ ఫొటోలకు వాడే కెమెరా కాబట్టి దీనికి వెబ్‌ కెమెరా అనే పేరు వచ్చింది. వాస్తవంగా ఇది పిసికి కనెక్ట్‌ అయి వుంటుంది కాబట్టి పిసి కెమెరా అనవచ్చు. ఇది ఇంటర్నెట్‌కే పరిమితం కాకుండా స్టిల్‌ కెమెరా, చాటింగ్‌కి, కాన్ఫరెన్సింగ్‌, మెయిల్స్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు.

వెబ్‌క్యామ్‌ ద్వారా టివి ప్రసారాలను కూడా ఇతరులకు పంపే సౌకర్యం వుంది. మన సిస్టమ్‌లో టివి ట్యూనర్‌కార్డ్‌ వున్నట్లయితే మెసెంజర్‌లోని వెబ్‌క్యామ్‌ సోర్స్‌ను సెలెక్ట్‌ చేసి అవసరమైన టివి ప్రసారాలను ఇతరులకు పంపవచ్చు. బ్రాడ్‌బ్యాండ్‌ వేగాన్ని బట్టి టివి వీడియో కదలికలు వుంటాయి.
ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన ప్రదేశాలలో వెబ్‌క్యామ్‌లు అమర్చడం జరిగింది. వీటి ద్వారా ప్రత్యక్షంగా ఆ ప్రదేశాలల్లో ఏమి జరుగుతుందో తెలుసుకొనే సౌకర్యం కలిగింది. ఇవి లైవ్‌ వీడియోలుగా కూడా ఉపయోగపడుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu