Ad Code

యుపిఎస్‌




యుపిఎస్‌ అనేది పవర్‌ పోయినప్పుడు కంప్యూటర్‌కు బ్యాకప్‌ పవర్‌ ఇచ్చేది అని అనుకుంటారు. కాని దానివలన కలిగే లాభాలు కొద్ది మందికే తెలుసు. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో ఇది ప్రతి ఒక్కరికి అవగాహన కావలసిన విషయం.
యుపిఎస్‌ పవర్‌ పోయినప్పుడు వపర్‌ను అందించడమేకాక కరెంట్‌లో వచ్చే హెచ్చు తగ్గులను నియంత్రించి కంప్యూటర్‌ పాడవ్వకుండా కాపాడుతుంది. కరెంట్‌ పోయినప్పుడు సిస్టమ్‌ అర్థాంతరంగా ఆగిపోతే డేటా కరప్ట్‌ కావడం, హార్డ్‌డిస్క్‌ క్రాష్‌ కాకుండా కాపాడుతుంది. స్పైక్‌, సర్జ్‌ల వల్ల కంప్యూటర్‌లోని లోపలి భాగాలకు భారీ నష్టం కలిగే ప్రమాదముంది. కొన్ని సందర్భాలలో ఎస్‌ఎంపిఎస్‌ కాలిపోవడం వరకే జరగవచ్చు. కంప్యూటర్‌ను సరిగ్గా షట్‌డౌన్‌ చేయకపోవడవల్ల కూడా ఫైల్స్‌ కరెప్ట్‌ అయ్యే ప్రమాదం వుంది. అందువల్ల కంప్యూటర్‌కు యుపిఎస్‌ను తప్పనిసరిగా వాడాలి.

Post a Comment

0 Comments

Close Menu