Ad Code

ఇంటర్నెట్‌ అనేది అనేక నెట్‌ల కలయిక







మీకు ప్రార్థన చేయడానికి కూడా తీరికలేదా? నో ప్రోబ్లమ్‌ మీ కోసం ఆన్‌లైన్‌లో ప్రార్థనలు చేస్తాం!
మీరు షాపింగ్‌ చేయడానికి సమయం చిక్కడంలేదా? మీరు ఇంటి దగ్గర నుండే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి. మీరు కొనుగోలు చేసిన దానిని మీ ఇంటికే చేరుస్తాం!
మీ బిల్లు ఆన్‌లైన్‌లోనే చెల్లించి సమయాన్ని ఆదా చేసుకోంది!
ఇలాంటి ప్రకటనలు ప్రతి నిత్యం చూస్తున్నాము. ప్రతిది ఇంటర్నెట్‌ మయమైంది. ఈరోజు ఇంటర్నెట్‌ అంటే తెలియని వారుండరు. ఇది నిత్యావసరమై కూర్చొంది. అదే యువత పెడ మార్గానికి కారణమౌతుంది. ఎక్కడ మంచి వుంటుందో, అక్కడే చెడు కూడా వుంటుందంటారు. చెడును వదలి మంచిని స్వీకరించే తత్వాన్నికి యువత దృష్టిని మరల్చవలసిన అవసరం ఎంతైనా వుంది.
ఇంటర్నెట్‌ అనేది అనేక నెట్‌ల కలయిక. విభిన్న రకాల కలయికలు భౌతికంగా ఒక దానితో మరొకటి అనుసంధానించబడి ఒకే పరిభాషలో వ్యవహారాలను నడుపుకోవచ్చు.
ఇంటర్నెట్‌ అనగానే మనకు ఠక్కున గుర్తు వచ్చేది బ్లాగ్‌లు. వీటికి 1990లోనే టిమ్‌ బెర్నర్‌ అనే శాస్త్రవేత్త మరి కొంతమంది శాస్త్రవేత్తలతో కలిసి యూరోపియన్‌ పార్టికల్‌ ఫిజిక్స్‌ లేబరేటరీలో ఇంటర్నెట్‌ విప్లవానికి నాంది పలికారు. హైపర్‌ లాంగ్వేజిని వాడి నేడు వాడుతున్న బ్రౌజర్‌ని పోలివుండే బౌజర్‌ను వాడుకలోకి తెచ్చారు.

Post a Comment

0 Comments

Close Menu