Ad Code

లైనక్స్‌ టెక్నికల్‌ వర్డ్స్‌



కెర్నెల్‌
లైనక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో కెర్నెల్‌ అనేది కీలకమైనది. హార్డ్‌వేర్‌తో సంభాషిస్తూ మన పనులకు చేసిపెడుతుంది. కంప్యూటర్‌ బూట్‌కాగానే కెర్నెల్‌ మెమరీలోకి లోడ్‌ అవుతుంది.
షెల్‌
కంప్యూటర్‌కి, యూజర్‌కి అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంది.
ఇన్‌ఫుట్‌, ఔట్‌ఫుట్‌ రీ డైరెక్షన్‌
ఒక ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్‌ చేసి ఫలితాన్ని స్క్రీన్‌పై చూడవచ్చు. అలా కాకుండా ఒక ఫైల్‌ ఔట్‌ఫుట్‌ని మరొక ఫైల్‌ ఇన్‌ఫుట్‌గా పంపడం లేదా ఔట్‌ఫుట్‌ని ఫైల్‌ రూపంలో స్టోర్‌ చేయడం కూడా చేయవచ్చు. ఫలితాన్ని తెరపై చూడకుండా నేరుగా ఫైల్‌లో రాయవచ్చునన్నమాట. ఇలా చేయడాన్ని రీ డైరెక్షన్‌ చేయడమని అంటారు. ఏక కాలంలో ఇన్‌ఫుట్‌ని, ఔట్‌పుట్‌ని కూడా రీ డైరెక్షన్‌ చేయవచ్చు.
పైప్స్‌
సులభమైన, చిన్నపాటి ప్రోగ్రామ్‌లు వ్రాసి క్లిష్టమైన పనులు చేయమని చెప్పేవే పైప్స్‌. ప్రోగ్రామింగ్‌ పనుల్ని సులభతరం చేస్తాయి.
వైల్‌కార్డ్‌ పాటర్న్స్‌
డాస్‌ కమాండ్స్‌లో వాడే లి,? వంటి గుర్తులతో వాడే వైల్డ్‌కార్డులు.
షెల్‌ స్క్రిప్ట్స్‌
కొన్ని కమాండ్‌లను వెంట వెంటనే వాడాలసినప్పుడు కమాండ్‌ ప్రామ్ట్‌ వద్ద ఒక్కొక్కటి ఇవ్వకుండా, మనకు కావలసిన వరుసలో టైప్‌ చేసి ప్రామ్ట్‌వద్ద ఫైల్‌ పేరు ఇస్తే, ఒకదాని తరువాత ఒకటి ఎగ్జిక్యూట్‌ అవుతాయి. ఫైల్‌కి ఎగ్జిక్యూషన్‌ పర్మిషన్‌ లేకపోతే రష్ట్ర దళశ్రీవఅaఎవగ అని ఇవ్వాల్సి వుంటుంది.
షెల్‌ వేరియబుల్స్‌
డేటాని వేరియబుల్స్‌ రూపంలో వుంచి షెల్‌ ప్రవర్తనను నియంత్రిచేవి. అందరూ వాడే షెల్‌ని బాష్‌ అంటారు.
లాగిన్‌, లాగౌట్‌
సిస్టమ్‌లోకి వెళ్లడాన్ని లాగిన్‌ అని వెనక్కి రావడాన్ని లాగౌట్‌ అని అంటారు.
ఓపెన్‌ సోర్సెస్‌
బైనరీ ఫైల్స్‌ కాకుండా సోర్స్‌ కోడ్‌లో ఇవ్వడం. ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ అనే దానికి మారు పేరు ఓపెన్‌ సోర్సెస్‌.
ప్యాకేజీస్‌
సాఫ్ట్‌వేర్‌లనే ప్యాకేజీస్‌ అంటారు.

Post a Comment

1 Comments

Emoji
(y)
:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
:>)
(o)
:p
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
x-)
(k)

Close Menu