Header Ads Widget

ఇంటర్నెట్ జూలై 9న ఆగిపోతుందా ?

జులై 9 న ప్రపంచంలో ఎక్కడా ఇంటర్నెట్ పనిచేయకపోవచ్చని గూగుల్ తెలిపింది. FBI ఒక సేఫ్టీనెట్ను ఉపయోగించి వైరస్ బారిన పడకుండా ప్రభుత్వ కంప్యూటర్లకు ఎటువంటి వైరస్ల ముప్పు రాకుండా చేయాలని ప్రయత్నించారు కాని జూలై తొమ్మిదో తేదీన మాత్రం ఏమి చేయలేరట.
అవగాహన కల్పించేందుకు గూగుల్ ప్రచారం ప్రాంభించింది. వైరస్ వచ్చిన కంప్యూటర్లలో గూగుల్ సెర్చి పేజీని తెరవగానే పైభాగంలో ఒక ప్రత్యేకమైన సందేశం పంపుతుంది వైరస్ వచ్చిన కంప్యూటర్లకే సందేశాలు పంపడం, అది కూడా వారికి ఇష్టమైన భాషలో పంపడం వల్ల ఫలితం ఉంటుందని గూగుల్ సెక్యూరిటీ ఇంజనీర్ డామియన్ మెన్షర్ తమ బ్లాగ్లో రాశారు. దింతో వెబ్ బ్రౌజింగ్ బాగా నెమ్మది అవుతుందని నిపుణులు అంటున్నారు.
గత కొంత కాలంగా అంతర్జాలంలో సమస్యలు స్ళష్టిస్తున్న డొమైన్ నేమ్ సిస్టమ్ (డిఎన్ఎస్) మాల్వేర్ మరో సారి విజ్ళంభించేందుకు సిద్ధం అయ్యింది. ఆ మాల్వేర్ దాడి చేసిది జులై 9 న ని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఒక వేళ మీ సిస్టం మాల్ వేర్ బారిన పడితే కొన్ని ఉచిత టూల్స్ ని ఇన్ స్టాల్ చేసి సమస్యను అధిగమించవచ్చు. దీనికి సంబంధించి క్విక్ హీల్ యాంటీ వైరస్ సంస్థ ఉచిత అప్లికేషన్ ను అందిస్తోంది. www.quickheal.com/chkdns.aspలోకి లాగినై సంబంధిత లింక్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ సిస్టమ్ మాల్ వేర్ భారిన పడినట్లయితే డౌన్ లోడ్ చేసుకన్న అప్లికేషన్ ను రన్ చేసి మరమ్మతు చేసుకోవచ్చు.
2007లో ఆరుగురు వ్యక్తులు కలసి డీఎన్ఎస్ ఛేంజర్ మాల్వేర్ను రూపొందించి దాన్ని ఇంటర్నెట్లో విశ్వవ్యాప్తం చేశారు. దీని వల్ల యూజర్లు తమ ప్రమేయం లేకుండానే, తాము కోరుకోకుండానే ఇతర సైట్లకు వెళ్తారు. ఈ మాల్వేర్ వ్యక్తిగత కంప్యూటర్లతో పాటుగా వాటికి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించే ప్రధాన సర్వర్లకూ సోకడం ప్రస్తుత సమస్యకు మూలకారణం. ఈ సమస్యను పరిష్కరించేందుకు అమెరికాకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగింది.
డీఎన్ఎస్ ఛేంజర్ అనేది ప్రమాదకరమైన మాల్వేర్. ఇది రెండు రకాలుగా పని చేస్తుంది. మొదటి రకం ప్రకారం, ఇది యూజర్ డీఎన్ఎస్ సర్వర్ సెట్టింగ్లను మార్చివేస్తుంది. మంచి సర్వర్ నుంచి యూజర్ కనెక్షన్ను తనకు చెందిన చెడ్డ సర్వర్కు మారుస్తుంది. నేరగాళ్ళు ఈ విధమైన రోగ్ సర్వర్లను ప్రపంచవ్యాప్తంగా నెలకొల్పారు. మరో రకం ప్రకారం, ఈ నేరగాళ్ళు రూటర్స్ లేదా హోమ్ గేట్వేలను తమ లక్ష్యంగా చేసుకుంటారు. పాస్వర్డ్లను సులభంగా బ్రేక్ చేస్తారు. తద్వారా వాటి డీఎన్ఎస్ సెట్టింగ్లను మార్చివేస్తారు.
ఈ మాల్వేర్ను FBI గుర్తించి దాన్ని క్రాక్డౌన్ చేసే నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో 40 లక్షల పీసీలు ఈ మాల్వేర్ బారిన పడ్డాయి. 14 మిలియన్ డాలర్ల మేరకు నేరగాళ్ళు కొల్లగొట్టారు. సాధారణంగా ఫార్చ్యూన్ 500 కంపెనీలు (ప్రపంచ అగ్రస్థాయి కంపెనీలు) పటిష్ఠమైన కంప్యూటర్, ఇంటర్నెట్ భద్రత ఏర్పాట్లను కలిగి ఉంటాయి. అవన్నీ డొల్ల అని ఈ మాల్వేర్ నిరూపించింది. ఈ కంపెనీల్లో సగానికి సగం ఈ మాల్వేర్ బారిన పడ్డాయి. 55 ప్రభుత్వ వెబ్సైట్లలో కూడా ఈ మాల్వేర్ ప్రవేశించింది. మొత్తం మీద 5,00,000 లైవ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఈ మాల్వేర్ అంతా ఒకే రకంగా కూడా ఉండదు. దీనిలో సుమారు 70 రకాలను ఒక్క భారత్లోనే గుర్తించారు. భారత్లోనూ కొన్నివేల కంప్యూటర్లు ఈ మాల్వేర్ బారిన పడ్డాయి.

Post a Comment

0 Comments