Header Ads Widget

3డి అల్ట్రాసౌండ బ్రెయిన్‌

ఇప్పటి వరకు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మనిషి మెదడుకు సంబంధించిన చిత్రాలు 2డిలో మాత్రమే వీక్షించే సౌలభ్యం ఉంది. కానీ, డ్యూక్‌ యూనివర్శిటీ పరిశోధకులు సరికొత్త తరహా ఆల్ట్రాసౌండ్‌ ఎండోస్కోప్‌ పరికరాన్ని అభివృద్ధి చేశారు. దీనిసాయంతో మనిషి మెదడుకు సంబంధించిన మరింత ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే దీన్ని వివిధ జంతువులు, ఎంపిక చేసిన వ్యక్తులపై ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఇది విజయవంతం అయిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 2డి విధానం కన్నా ఇది చాలా తక్కువ ధరకే లభించనున్నదని, మరింత మెరుగైన ఫలితాలు సైతం దీని ద్వారా వైద్యులు పొందవచ్చునని డ్యూక్‌ యూనివర్శిటీలో ఈ 3డి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కె.కిర్క్‌షుంగ్‌ వ్యాఖ్యానించారు. తొలిసారిగా ఈ 3డి మెదడుకు సంబంధించిన ప్రయోగం కుక్కలపై ప్రయోగించామని ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో, ఈ ప్రాజెక్ట్‌ను మరింత ముందుకు తీసుకురావటంతో ఊహించని దానికన్నా తక్కువ వ్యయం, కాలంలోనే ఇది పూర్తయిందని ఆయన అన్నారు. తొలిసారిగా కుక్కకు మత్తు ఇచ్చి, దాని మెదడును స్పష్టంగా తీయగలినట్లు తెలిపారు. ప్రస్తుతం న్యూరోసర్జన్‌లు తమ దగ్గరకు వచ్చిన రోగి మెదడుకి సంబంధించిన వివరాలను సిటి స్కాన్‌, ఎమ్‌ఆర్‌ఐల ద్వారా తెలుసుకొని ఆపరేషన్స్‌ చేస్తున్నారు. అయితే ఇలా ఆపరేషన్‌ చేసే సమయంలో ఒక్కోసారి వారికి అనేకరకాలైన అవాంతరాలు ఎదురైతున్నాయి. అటువంటి వాటన్నిటికీ ఏకైక పరిష్కారమే ఈ 3డి అల్ట్రాసౌండ్‌ ఎండోస్కోప్‌గా ఆయన పేర్కొంటున్నారు. దీని వల్ల డాక్టర్స్‌కి రోగి మెదడు గురించి పూర్తి అవగాహన ఏర్పడుతుంది.
దీనిపై ఆయన మరింత సమాచారం వెల్లడిస్తూ... ఉదాహరణకు సిటి స్కానింగ్‌ విధానాన్నే తీసుకుందాము. ఇది అయస్కాంత సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తుంది. తద్వారా అయస్కాంతా కిరణాలు పరావర్తనం చెంది మనిషి మెదడుకు సంబంధించిన వివరాలను స్క్రీన్‌పై 2డి విధానంలో ప్రతిబింబిస్తాయి. అయితే ఫలితాలు నూటికి నూరు శాతమని ఎవ్వరూ ఖచ్చితంగా ఉంటాయని చెప్పలేరు. అంతేగాక, ఈ విధానం చాలా ఖరీదైన వ్యవహారం కూడా. మెదడులో కణతలను తొలగించటానికి దీనిపై ఎక్కువగా న్యూరోసర్జన్స్‌ ఆధారపడతారు. అయితే తాము అభివృద్ధి చేసిన 3డి విధానం ద్వారా ఖచ్చితంగా నూటికి నూరు శాతం కణతను ఎంత పరిమాణంలో ఉందో, దాన్ని ఎంతమేర తొలగించవచ్చునో, ముందుగానే సులభంగా న్యూరోసర్జన్లు గుర్తించగలరని ఈ ప్రాజెక్ట్‌లో పాలుపంచుకుంటున్న డ్యూక్‌ యూనివర్శిటీకి చెందిన బయో ఇంజనీర్‌ స్టీఫెన్‌ స్మిత్‌ వ్యాఖ్యానించారు. ఈ 3డికి, 2డికి మధ్యన తేడా ధరలోనే కాదు, పనితీరులోనే అసలు వ్యత్యాసం ఉందని తెలుపుతున్నారు. ఎందువల్ల అంటే...ఈ 3డి విధానంలో మెదడుకి సంబంధించిన అతి చిన్న భాగాన్ని సైతం ఎంతో స్పష్టంగా చిత్రీకరించగలదు అదీ ఎంతో నాణ్యతతో.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..ఈ 3డి విధానాన్ని 1980ల్లోనే శాస్త్రవేత్తలు చేపట్టినప్పటికీ, అప్పట్లో అవాంతరాలు ఏర్పడటంతో ఈ ప్రయోగాన్ని ఆపారు. మళ్లీ 27 సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టి విజయవంతం అయింది.
దీన్ని ఎలా రూపొందించారు?
3డి అల్ట్రాసౌండ్‌ ఎండోస్కోప్‌కి 100 నుంచి 500 వైర్లు ఏర్పాటు చేసి దీన్ని ప్రత్యేకంగా రూపొందించిన ట్యూబ్‌కి అనుసంధానం చేశారు. దాని నుంచి అల్ట్రా సౌండ్‌ కిరణాలను నాజిల్‌ ద్వారా ప్రసరింపజేశారు. ఇలా ప్రసారమయ్యే కిరణాలను విశ్లేషించటానికి 500 ట్రాన్స్‌మిటర్స్‌ను అమర్చటం జరిగింది.

Post a Comment

0 Comments