Ad Code

ఇంటర్నెట్‌లో ఫోన్‌కాల్స్‌


ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న మీ బంధువులతో ఏదైన శుభకార్యం గురించి మాట్లాడాలను కున్నప్పుడు ముందుగా ఆలోచించేది ఫోన్‌ బిల్‌ గురించే. ఇంటర్నెట్‌ సదుపాయం ఉన్న ఇంటర్నెట్‌ సాయంతో ఫోన్‌ కాల్స్‌ చేసుకొని తక్కువ ఖరీదులోనే తమ వారితో సంభాషించుకోవచ్చు. అటువంటి సదుపాయం లేని గ్రామీణ ప్రాంతాల వారు ఇకపై ఆ చింత అవసరం లేదు. వేలకు వేలు పోసి ఇంటర్నేషనల్‌ కాల్స్‌ చేయాల్సిన అగత్యమూ ఉండదు. కేవలం వెయ్యి రూపాయలు ఖరీదుతో వి-టెల్‌ కాలింగ్‌ కార్డును కొనుగోలు చేయటం ద్వారా ఫోన్‌ బిల్స్‌ నుంచి తప్పించుకోవచ్చు. తమ పిల్లలతో ఎంతో సౌకర్యవంతంగా మాట్లాడుకోవచ్చు. దీనికోసం చేయాల్సిందల్లా కాలింగ్‌ కార్డు వెనుక ఉన్నటువంటి చిన్నపాటి సూచనలు పాటిస్తే చాలు. మీరు ప్రపంచంలో సుదూర ప్రాంతాల్లో ఉన్న మీ వారితో గంటల తరబడి సంభాషించుకొనే సౌలభ్యం కల్పిస్తోంది ధనుష్‌ టెక్నాలజీ సంస్థ. ముంబయికి చెందిన ఈ సంస్థ వి-టెల్‌ అనే పేరుతో కాలింగ్‌ కార్డును ప్రవేశపెట్టింది. దీని సాయంతో సుమారు 200 దేశాలకు పైగా తక్కువ కాల్‌రేట్లకే కాల్‌ చేసుకొనే సౌకర్యం కల్పిస్తోందీ సంస్థ. కేవలం భారత్‌లోనే గాక, మీరు విదేశాలు వెళ్లినప్పుడు సైతం ఆయా దేశాల నుంచి తక్కువ కాల్‌రేట్లకే ఫోన్‌ చేసుకోవచ్చునని సంస్థ తెలియజేస్తోంది. మరింత సమాచారం కోసం skye అనే వెబ్‌సైట్‌ను సందర్శించండి.ఈ కార్డ్‌ ప్రత్యేకతలివే...
- కేవలం 10 నుంచి 15 డాలర్లకే లభ్యం కావటం దీని ప్రత్యేకత.
- దీని ద్వారా అతి తక్కువ ధరకే అంటే సాధారణ కాల్‌ రేట్‌తో పోలిస్తే నూరు శాతానికి పైగా కాల్‌ ఛార్జీ గణనీయంగా తగ్గుతుంది.
- భారత్‌లో రూపాయల్లో లభ్యమవుతుంది. మీరు దీన్ని ఎక్కడ నుంచి ఉపయోగించినా భారతీయ కరెన్సీ రూపాయల్లోనే బిల్లింగ్‌ అవుతుంది. ఇందులో పైకి కన్పించని బిల్లింగ్‌ ఏమీ లేవు.
- 200 దేశాల్లో వినియోగించుకునే సౌలభ్యం.

Post a Comment

0 Comments

Close Menu