మీరు చూస్తున్నది గిటార్‌ అయితే, గిటార్‌ కాదు అంటారు ఏమిటబ్బా..? అనుకుంటున్నారా..! అవును నిజమండీ..! మీరు చూస్తున్నది గిటార్‌ ఆకారంలో ఉన్న గేమింగ్‌ పరికరం. ఇది హీరో 3 గిబ్సన్‌ కంట్రోలర్‌. దీని సాయంతో మీరు డబ్ల్యుఐఐ, ఎక్స్‌బాక్స్‌ 360, పిఎస్‌3 వంటి వీడియో గేమ్స్‌ను ఆడుకోవచ్చు.


ఇ-ఐపాడ్‌కు 'ఫొడాసో

హ్యాకర్స్‌ కంప్యూటర్లు, మొబైల్స్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలకే పరిమితం కాలేదని ఇప్పడు జరిగిన సంఘటనతో నిరూపించుకుంటున్నారు. ఇ-ఐపాడ్‌కు 'ఫొడాసో' వంటి సెక్యూరిటీ ఫైర్‌వాల్స్‌ఉన్నా, హ్యాకర్‌ 'ఓస్లో.జిప్‌' ఎక్స్‌టెన్షన్‌ పేరుతో ఉన్న వైరస్‌ను విజయ వంతంగా పంపించారు. క్యాస్‌పెర్‌కే ల్యాబ్స్‌ వారు ఐపాడ్‌కు వైరస్‌ సోకిందనే విషయాన్ని ధృవీకరించింది. ఈ రకమైన వైరస్‌ ఐపాడ్‌లకు సోకడం ఇదే ప్రధమమని ఈ సంస్థ వెల్లడించింది. ప్రత్యేకించి ఐపాడ్‌ లైనక్స్‌ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆధారంగా పనిచేసే ఈ ఐపాడ్స్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకొని ఈ వైరస్‌ వ్యాప్తి చెందలేదని నిపుణుల వాదన. ఆపిల్‌ సంస్థ రూపొందించిన ఇ-ఐపాడ్స్‌పైనే వైరస్‌ ఎటాక్‌ చేయటమనేది చర్చనీయాంశంగా మారింది. అందులోనూ ఫ్రీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ లైనక్స్‌లో భద్రతా లోపాలున్నాయని వెల్లడించటమే దీని ఉద్ధేశంగా వెల్లడవుతోంది. అయితే ఇది వైరస్‌ కాదని, ఎలక్ట్రానిక్స్‌లో చిన్నపాటి లోపంగా ఆపిల్‌ సంస్థ పేర్కొంటంది. ఏదేమైనా ఈ వైరస్‌ బూచి ఒక్కసారిగా అందరినీ హడల్‌కొట్టింది. 
 

పేపర్లు చదవొచ్చు...
ఇంత వరకు ఐపాడ్‌లపై వీడియోలు, మ్యూజిక్‌ను మాత్రమే వింటున్నారా! అయితే ఐపాడ్‌లను ఉపయోగించి పత్రికలు, మేగజైన్‌లు సైతం చదవొచ్చు. దీని కోసం పెరూజ్‌ అనే వెబ్‌సైట్‌ ప్రత్యేకంగా సర్వీస్‌లను అందిస్తోంది. దీని ద్వారా ప్రముఖ పత్రికల, మేగజైన్‌లను ఐపాడ్‌లపై చదవొచ్చు. ఈ సర్వీస్‌ను కేవలం ఈ వెబ్‌సైట్‌ మాత్రమే అందజేస్తోంది. దీని కోసం ఆ సంస్థ ప్రతి పేజిని ఫొటోగా పొందుపరిచింది. వీటిని సైట్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్‌ చేసుకోవటం ద్వారా ఆయా పేజీలను చదవటానికి వీలుపడుతుంది. ఇందులోని లోపం ఏమంటే.. ఆయా పేజిల్లో ముఖ్యమైన భాగాలను చదవాలంటే కుదరదు. అంతేగాక ఐపాడ్‌ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని అన్నిరకాలైన పుస్తకాలు నేడు వెబ్‌సైట్‌లో లభిస్తున్నాయి. హాస్యం, గేమ్స్‌, స్పోర్ట్స్‌, పొలిటికల్‌ వంటి రంగాల వారీగా విశ్లేషణలు సైతం ఫొటో ఫార్మేట్‌లో లభిస్తున్నాయి. ఈ సైట్‌ నుంచి నేరుగా మీ మెయిల్‌కి లింక్స్‌ను సైతం పంపవచ్చు.