Ad Code

ఐడిలు, పాస్‌వర్డ్స్‌ను క్రియేట్‌చేయటం ద్వారా ఆదాయం సంపాదిస్తున్నారు

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ మీద గత పది సంవత్సరాలతో పోల్చుకుంటే, ప్రస్తుతం ఇంటర్నెట్‌నే ఆయుధంగా దాడులు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా దాడి చేసేవారిలో పరిణితిచెందిన నిపుణులే ఉండటంతో, ఈ దాడులకు అడ్డూఆపూ లేకుండా పోతోందని వారు వెల్లడిస్తున్నారు. ప్రత్యేకించి, అతితక్కువ వ్యవధిలో ఎక్కువ ఆదాయం సంపాదించటమూ దీనికి కారణంగా పేర్కొంటున్నారు. హైటెక్‌ టెక్నాలజీ సాయంతో క్రెడిట్‌కార్డులను ఢకోీడ్‌ చేయటం, ఇతరుల ఐడిలు, పాస్‌వర్డ్స్‌ను క్రియేట్‌చేయటం వంటి పనుల ద్వారా ఆదాయం సంపాదిస్తున్నారు. దీనికి అనేకరకాలైన కారణాలున్నాయి. ఇంటర్నెట్‌నే ప్రధాన ఆయుధంగా చేసుకొని ఏదైన వ్యవస్థ, ఎవరి మెయిల్స్‌ను హ్యాకింగ్‌ చేయటం ద్వారా హ్యాకర్స్‌, హైటెక్‌ క్రిమినల్స్‌ ఆదాయం సంపాదిస్తున్నా, వారు ఎక్కడ నుంచి దాడి చేశారో, ఆ దేశంలో ఇంటర్నెట్‌ చట్టాలు సక్రమంగా లేకపోతే ఇదే పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ చట్టాలు సక్రమంగా అమలు అయితే, ఇటువంటి పరిస్థితిని కొంతమేర చక్కదిద్దవచ్చు అని నిపుణులు పేర్కొంటున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu