Ad Code

సన్నబడుతున్న సెమికండక్టర్‌..

ఎలక్ట్రానిక్‌ వస్తువుల్లో సెమికండకర్ట్స్‌ల ప్రాధాన్యం చెప్పలేనిది. అయితే ఈ సిలికాన్‌తో సెమికండక్టర్‌ను రూపొందించటంలో చాలా సమస్యలు ఎదురు అవుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే దీనికి పరిష్కారం కూడా ఉందంటున్నారు. అయితే అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. సిలికాన్‌ పదార్ధంతో వస్తువులను తయారు చేయటానికే ఎలక్ట్రానిక్‌ పరిశ్రమ ఎక్కువగా మెగ్గుచూపుతున్నట్లు, ఇటీవల పలు పరిశోధనల్లోనూ సిలికాన్‌ ప్రధానంగా తీసుకొనే జరగటం దీని ప్రాధాన్యం తెలియజేస్తున్నాయి. దీనికి ప్రధానకారణం సిలికాన్‌లో ఉండే ప్రత్యేకమైన స్వాభావిక లక్షణమే. దీని ద్వారా ఏ ఎలక్ట్రానిక్‌ అణువులైనా అత్యంత వేగంగా ప్రవహించటమే సిలికాన్‌ రహస్యం. యాంబర్‌ వేవ్‌ సిస్టమ్స్‌ వారు దీనికి ప్రత్యామ్నాయం ఉందంటున్నారు. ఒకసారి వారు ఏమి చెబుతున్నారో పరిశీలిస్తే...ఎలక్ట్రికల్‌ పరికరాల్లో వినియోగించే సిలికాన్‌ను మరికొన్ని రకాలైన ఇతర పదార్థాలతో (మెటీరియల్స్‌) కలిపి చిన్నపాటి వేగంగా పనిచేయగలిగే విధంగా రూపొందించారు. ప్రత్యేకించి ఇవి వివిధ రకాలైన సెమికండక్టర్స్‌తో పోల్చి చూశారు. వాటన్నిటి కన్నా ఈ సెమికండక్టర్‌ తయారీలో తక్కువ సమయం, అత్యధిక వేడిని తట్టుకునే సౌలభ్యం ఉంది. అదే సెమికండక్టర్స్‌ తయారీలో వినియోగించే లేజర్స్‌, డిటెక్టర్‌ అవసరం అనేది ఈ విధానంలో ఉండదు. మరో విశేషం ఏమిటంటే..ఇవి అన్ని రకాల వాతావరణాలను తట్టుకోగలదని తయారీదార్లు తెలుపుతున్నారు. దీనిపై మరింత పరిశోధనలు జరుపుతున్నట్లు ఇందులో పాలుపంచుకుంటున్న కాలిఫోర్నియా యూనివర్శిటీ ఫ్రొఫెసర్‌ జాన్‌ బ్రౌజర్స్‌ అన్నారు. ఇది సూక్ష్మస్థాయిలో చేసిన ఫలితాలు మాత్రమే. పూర్తిస్థాయిలో ఫలితాలు వస్తే ఇప్పుడున్న ఎలక్ట్రానిక్‌ వస్తువులు మరింత చౌకగా లభించే అవకాశాలున్నట్లు ఆయనంటున్నారు.

Post a Comment

0 Comments

Close Menu