Ad Code

HD అంటే High Definition

                             HD Vs SD
         HD అంటే High Definition. ఇది మామూలు Standard Definition ( SD ) కంటే నాణ్యమైనది. SD టీవీ సెట్ లేదా వీడియో లో పైనుంచి కిందికి 480 వరుసల పిక్సెల్స్ ఉంటాయి. అందుకే SD గురించి చెప్పేటప్పుడు 480p అని చెబుతారు. అదే HD అయితే పైనుంచి కిందికి 720 లేదా 1080 పిక్సెల్స్ ఉంటాయి. దీన్ని 720p/1080p అంటారు. దృశ్యాల నాణ్యత మెరుగ్గా ఉండాలంటే SD తెర కంటే HD తెర వాడాలి. ఒక విధంగా చెప్పాలంటే HD  అనేది మన డిజిటల్ కెమెరాల్లాంటిది. ఎన్ని మెగా పిక్సెల్స్ ఎక్కువుంటే నాణ్యత అంత ఎక్కువవుతుంది. మామూలు చిన్న టీవీ తెర మీద చూసినప్పుడు మనకు SD కి, HD కి పెద్దగా తేడా తెలియకపోవచ్చు. కానీ తెర సైజు పెరిగేకొద్దీ  తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చిన్న తెరమీద బొమ్మ బాగా తేలిపోయినట్టుంటుంది. దాన్నే పిక్సలేట్ కావడమంటారు. అంటే, తెర సిజు పెరిగినా పిక్సెల్స్ పెరగకపోవటం వలన ఆ పరిస్థితి వస్తుంది. చిన్న తెరకు తక్కువ పిక్సెల్స్ సరిపోయినా, పెద్ద తెరకు ఎక్కువ పిక్సెల్స్ అవసరం కాబట్టి ఇళ్ళలో టీవీ తెరల సైజు పెరుగుతున్న సమయంలో నాణ్యత కోసం HD ప్రసారాలపట్ల మోజు పెరుగుతోంది.



ex
       HD వలన కలిగే ప్రయోజనాన్ని పూర్తి స్థాయిలో పొందాలంటే HD సామర్థ్యమున్న టీవీ సెట్ కావాలి, HD వీడియో సిగ్నల్ కావాలి. రాష్ట్రంలో మార్కెట్ అంచనాల ప్రకారం పది శాతాన్ని మించి HD టీవీ సెట్లు లేవు. కనీసం యాభై శాతం దాటాలన్నా ఇంకో ఐదారు సంవత్సరాలు పడుతుందన్నది ఫిక్కీ ( Federation of Indian Chamber of Commerce and Industry ) అంచనా. ఇక HD  వీడియో సిగ్నల్ విషయానికొస్తే, DTH ద్వారా సాధ్యమే అయినా, కేబుల్ ఆపరేటర్లలో 95% మందికి వీలుకాదు. కాకపోతే, మనం పంపే HD సిగ్నల్ ఆ చిన్న తెరలో పట్టేవిధంగా కంప్రెస్ అవుతుంది. అప్పుడు తెర మీద పైన, కింద ఖాళీ ఏర్పడి తెరమీద కొద్దిభాగానికే దృశ్యం పరిమితమవుతుంది.

----------------------------------------

_________________________________

   
          అదే HD తెరమీద SD సిగ్నల్ అయితే ఇరువైపులా ఖాళీ వస్తుంది. కానీ అది తెరనిండుగా వచ్చేలా దానంతట అదే సాగటం వలన బొమ్మ అడ్డంగా సాగి, అందులో మనుఢులు కాస్త లావుగా కనిపిస్తారు. అయితే ఇప్పుడు వస్తున్న టీవీలు చాలావరకు SD సిగ్నల్ ను HD తెరమీద ( 16:9) బాగానే కనిపించేలా చేయగలుగుతున్నాయి.
         
         












           ఇప్పటికీ SD  ఎక్కువగా వాడుకలో ఉంది. HD టీవీలు గాని, HD  బ్రాడ్ కాస్టర్లు గాని చాలా తక్కువ. HD సామర్థ్యమున్న టీవీ సెట్ కొనుక్కున్నంత మాత్రాన వెంటనే దృశ్యాలు అద్భుతంగా కానరావు. కానీ భవిష్యత్తులో రాబోయే మార్పులకు సంసిద్ధంగా ఉన్నట్టు మాత్రమే లెక్క
             HD టీవీ దాని దృశ్యాలకోసం SD టీవీ కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ డేటా ఉపయోగించుకుంటుంది.  అందువలన స్టోరేజ్ చాలా ఎక్కువ అవసరమవుతుంది. ప్రసారానికి కూడా కనీసం మూడురెట్లు ఎక్కువ బాండ్ విడ్త్ కావాల్సి ఉంటుంది.

Post a Comment

1 Comments

  1. చాలా విషయాలు తెలియచేశారు మాలాంటివాళ్ళకు ఉపయొగకరంగా ఉంటాయి

    ReplyDelete
Emoji
(y)
:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
:>)
(o)
:p
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
x-)
(k)

Close Menu