పైన చూస్తున్న చిత్రంలో ఉన్నవి కీచైన్స్ అని ఎవరైనా ఇట్టే గుర్తు పట్టేస్తారు. కానీ అసలు విషయం ఇక్కడే ఉంది. విషయం ఏమిటంటే..మీరు చూస్తున్న కీచైన్స్‌ను ప్రముఖ డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ క్రియేటివ్ సంస్థ రూపొందించింది. వీటిలో ఎమ్‌పి3 ప్లేయర్‌ను అంతర్గతంగా పొందుపరిచినట్లు సంస్థ తెలియజేసింది. ఇవి ఒక్కోటి ఒక్కో రూపంలో(చైన్, రిస్ట్‌బ్యాండ్, వాచీ) విడుదల చేస్తున్న ఈ ప్లేయర్స్ అయిదు విభిన్న రంగుల్లో లభిస్తాయని సంస్థ పేర్కొంది. ఇవి అన్ని జెన్‌స్టోర్స్‌లో లభ్యమవుతాయని అయితే, లిమిటెడ్ ఎడిషన్‌గా వీటిని విడుదల చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. వీటి ప్రారంభ ధర రూ.249ల నుంచి రూ.499 వరకు లభ్యమవతాయని (స్థానిక పన్నులు అదనం) వెల్లడించింది.
0 Comments