Ad Code

ఫొటో సర్వీస్‌లను నిలిపివేస్తున్న యాహూ..!



ఫొటో సర్వీస్‌లను నిలిపివేస్తున్నట్లు యాహూ సంస్థ వెల్లడించింది. దీని వల్ల యాహూలో ఫొటోలను ఉంచుకొన్నవారి ఫొటోలు మొత్తం పోయే అవకాశాలున్నాయి. అయితే, యాహూ యూజర్లు తమ ఫొటోలను ఫ్లికర్‌ సర్వీస్‌లో చూసుకోవచ్చునని యాహూ వెల్లడించింది. ఇప్పటికే అన్‌లిమిటెడ్‌ మెయిల్‌ స్టోరేజి ఇచ్చిన యాహూ భారీగా పెరుగుతున్న నెట్‌ ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని కొత్త సర్వీస్‌ను ప్రారంభించినట్లు భావిస్తున్నారు. అంతేగాక దీనివల్ల రెండు రకాలైన ఉపయోగాలున్నాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి సర్వీస్‌ల కన్నా విడగొట్టటం ద్వారా వినియోగదారులకు ఉపయుక్తకరమైన సేవలు అందించటం సాధ్యమౌతుందని సంస్థ భావిస్తోంది. యాహూ ఫొటోల్లో జూన్‌ 2006 నాటaికి రెండు బిలియన్‌లకు పైగా ఫొటోలు ఉన్నట్లు యాహూ వెల్లడించింది.
ఈ-మెయిల్‌ ద్వారా ఎస్‌ఎమ్‌ఎస్‌..
ఇప్పటికన్నా మెరుగైన విధంగా మొబైల్స్‌ ద్వారా కూడా మెయిల్స్‌ను చూడవచ్చునని యాహూ కంపెనీ వెల్లడించింది. వాణిజ్య సమాచారాన్ని పంపటం కూడా సాధ్యమౌతుందని సంస్థ తెలుపుతోంది. అంతేగాక ఇ-మెయిల్‌ నుంచి నేరుగా ఎస్‌ఎమ్‌ఎస్‌ పంపే అవకాశాన్ని త్వరలో కల్పించనున్నట్లు యాహూ వెల్లడించింది. తద్వారా ఇరవై ఐదు కోట్లకుపైగా యాహూ వినియోగదారులు ప్రపంచవ్యాప్తంగా లబ్ధిపొందే అవకాశాలున్నట్లు సంస్థ అంచనా వేసింది. ఇప్పటికే ఇంటర్నెట్‌లో మెయిల్‌ అన్‌లిమిటెడ్‌ స్టోరేజి ఇస్తున్న యాహూ, కొత్త విధానం ద్వారా మరింతగా పాపులర్‌ అయ్యే అవకాశాలున్నట్లు భావిస్తోంది.
దీని గురించి యాహూ వైస్‌ ప్రెసిడెంట్‌ జాన్‌ క్రెమర్‌ మాట్లాడుతూ యాహూ మెయిల్‌ను ప్రతి ఒక్కరూ తమ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ అవసరాలు తీర్చే విధంగా తీర్చిదిద్దటమే తమ ముందున్న లక్ష్యంగా తెలిపారు. వాల్యూ యాడెడ్‌ సర్వీస్‌లను ఒక పక్కన ప్రవేశపెడుతూనే మరోవైపు ఉచిత సర్వీసులకు కొత్త హంగులను సమకూర్చే పనిలో యాహూ ఉంది. ఈ అక్టోబర్‌ నాటికి 10వ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్న యాహూ కొత్త ఫీచర్లను వినియోగదారులకు బహుమతిగా ఇవ్వనుంది.


Post a Comment

0 Comments

Close Menu