Ad Code

డిసెంబర్ రెండవ ఆదివారం — తెలుగు బ్లాగుల దినోత్సవం!

తెలుగు బ్లాగుల దినోత్సవ ప్రత్యేక సమావేశపు నివేదిక — హైదరాబాద్

స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్, బహిరంగ జాలం, తెలుగు, ఇతరత్రా…

తెలుగు బ్లాగుల దినోత్సవండిసెంబర్ రెండవ ఆదివారం — తెలుగు బ్లాగుల దినోత్సవం!


అంటే, ఈ సంవత్సరం ఈ నెల 14వ తేదీన. మీ ఊళ్ళో/నగరంలో/పట్టణంలో ఆ రోజు తెలుగు బ్లాగరుల సమావేశాన్ని నిర్వహించండి. మీరు హైదరాబాదులో ఉంటున్నట్లయితే, మాతో కలవండి.
ఏమేంచెయ్యొచ్చు:
  • అందరూ కలిసి ఏదైనా సామాజిక ప్రయోజనమున్న పని చేయవచ్చు.
  • బ్లాగింగులోని సాంకేతిక లేదా ఇతర సమస్యలని ఇతరులని అడిగి ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవచ్చు.
  • అందరూ కలిసి కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు.
  • లేదా, జాలంలో తెలుగుకై మరింత గంభీరమైన పనులూ చెయ్యవచ్చు:
ఎలా:
  1. మీ ప్రాంతంలో ఉంటున్న బ్లాగరులెవరో తెలుసుకోండి. లేదా మీ ఊళ్ళో సమావేశం నిర్వహిద్దామనుకుంటున్నట్టు, తెలుగు బ్లాగు గుంపులోనూ, మీ బ్లాగులోనూ ప్రకటించండి. స్థలం మరియు సమయం నిర్ణయించి తెలియజేయండి.
  2. మిమ్మల్ని సంప్రదించగలిగే సమాచారం (ఫోను నంబరు, ఈ-మెయిలు చిరునామా, గట్రా) తెలియజేయండి.
  3. ఆ రోజు అనుకున్న స్థలంలో అనుకున్న సమయానికి అందుబాటులో ఉండండి.
  4. సమావేశం తర్వాత సమావేశం ఎలా జరిగిందీ వివరాలతో మీ బ్లాగులో టపా వ్రాయండి.
డిసెంబర్ రెండవ ఆదివారమే ఎందుకు:
  • 2007 డిసెంబరు నెల 13వ తేదీన తెలుగు బ్లాగు గుంపులో సభ్యుల సంఖ్య 1,000కి చేరుకుంది. ఆ రోజు ఆదివారం కాకపోయినా, ఆదివారాలు అయితే జనాలకి ఖాళీ ఉంటుందని.
  • ప్రతీ నెలా రెండవ ఆదివారం తెలుగు బ్లాగుల సమావేశం ఉంటుంది. మళ్ళీ బ్లాగుల దినోత్సవం కోసం ప్రత్యేక సమావేశం అవసరం లేకుండా, అదే రోజునైతే బాగుంటుందని.
పైన నేనుదహరించిన బొమ్మను మీ బ్లాగుల్లో వాడుకోవచ్చు.
తా.క.: హైదరాబాదు సమావేశపు నివేదికని e-తెలుగు సైటులో ప్రచురించాం.
ఆనంద బ్లాగాయనం!

Post a Comment

0 Comments

Close Menu