Ad Code

ఇప్పటి వరకు రోబో అంటే ఓ యంత్రం..!

ఇప్పటి వరకు రోబో అంటే ఓ యంత్రం..! మనం ఇచ్చే ఆజ్ఞలు ఆధారంగా పనిచేసే మర యంత్రం...మర మనిషి. ఏదైన పని చెబితే చేయటం వరకు దాని విధిగా భావించారు. అయితే నెదర్లాండ్స్‌ శాస్త్రవేత్తలు, ఫిలిఫ్స్‌ సంస్థ ఉమ్మడిగా సరికొత్త రోబోను సృష్టించారు. ఎమోషన్‌ క్యాట్‌ రోబోట్‌ అని ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌కు పేరు పెట్టారు.
దీని ప్రత్యేకత ఏమంటే..అచ్చం మనిషిలాగే హావభావాలను ప్రదర్శిస్తుందని తెలిపారు. ఈ రోబో మానవ-కంప్యూటర్స్‌ మధ్యన ఉన్నటువంటి ఎలక్ట్రానిక్‌ బంధాన్ని తుంచేస్తుందని తెలుపుతున్నారు.

ఇంత వరకు కంప్యూటర్స్‌ ద్వారా ఏదైనా పని చేయటం వరకే పరిమితం. యానిమేషన్స్‌లో గ్రాఫిక్స్‌ద్వారా భావాలను పలికించటం వరకే పరిమితం అవటం జరిగింది. మనిషి పలికించే భావాలను యంత్ర పరికరం ద్వారా పలికించాలి అంటే దాదాపు అసాధ్యమైన విషయంగా ఇంతవరకు అందరూ భావించారు. ఇది సాధ్యమేనంటున్నారు ఈ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న మెహెడీ దాస్తినీ అనే శాస్త్రవేత్త. ఈయన నెదర్లాండ్స్‌లోని ఉటిరిచ్‌ యూనివర్శిటీలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు.
ఆయన మాటల్లో...అసాధ్యం అయినదేదీ లేదు అన్నీ సాధ్యమే. అయితే..కంప్యూటర్స్‌ను వినియోగించి హావభావాలను పలికించటమనేది ఎంతో క్లిష్టమైన ప్రక్రియ. ఇక్కడ చేయాల్సినది చాలానే ఉంది. ప్రత్యేకించి, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ను వినియోగించి పలు రకాలైన హావభావాలను పలికించే విధంగా రూపుదిద్దటంలో అనేక అవాంతరాలున్నాయి. వాటిని తాము విజయవంతంగా కొంతమేర అధిగమించటంతో ఈ ఎమోషనల్‌ క్యాట్‌ రోబో రూపుదిద్దుకుందని తెలిపారు.

ఈ ప్రాజెక్ట్‌ పేరు ఐక్యాట్‌..
ప్రాజెక్ట్‌లో డచ్‌ శాస్త్రవేత్తలు, ఫిలిఫ్స్‌ సంస్థ భాగస్వామ్యంలో రూపుదిద్దుకుంటోంది. దీనికి అవసరమైనటువంటి హార్డ్‌వేర్‌ను ఫిలిఫ్స్‌ సంస్థ అందజేస్తోంది. ఈ ఐక్యాట్‌ (రోబో పిల్లి) ప్రాజెక్ట్‌కు అవసరమైనటువంటి హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ సైతం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి రూపొందించినట్లు తెలిపారు. ఈ రోబో పిల్లి రూపుదిద్దుకోవటానికి రోబోటిక్‌ ఫ్లాట్‌ఫామ్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
అయితే అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే..మనిషి ఏడ్చినప్పుడు ముఖం ఒక రకంగా, బాధతో ఉన్నప్పుడు, నవ్వుతున్నప్పుడు మరో రకంగా ఇలా అనేకరకాలైన హావభావాలను పలికించాల్సిన పరిస్థితిని ముఖంలో కనిపించే విధంగా తీర్చిదిద్దటమే అసలు సమస్యగా ఏర్పడింది. సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌లో అప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తి అయిపోయాయి. మనిషి ముఖం అయితే నవ్వితే కొంచెం వ్యాకోచిస్తుంది. ఏడిస్తే ముఖంలో చర్మం ముడతలు పడుతుంది. ఇది ఆర్టిఫిషియల్‌ రోబోతో రూపొందే పిల్లి. దీన్ని ప్లాస్టిక్‌తోను, ఎలక్ట్రానిక్స్‌ పరికరాల ఆధారంగా రూపొందిస్తారు. ఇది ఆ భావాలను ఎలా పలికిస్తుందనేది పెద్ద సమస్యగా నిలిచింది.

అధిగమించిందిలా..
ఈ రోబోపిల్లికి కను రెప్పలు, కంటి గుడ్డు, పెదాల ద్వారా హావభావాలను పలికించే విధంగా దీన్ని డిజైన్‌ చేయటం జరిగింది. ఉదాహరణకు ఎవరైనా ఏదైనా అతిశయోక్తి చెబితే..అవునా!! అని ఆశ్చర్యార్థక భావాన్ని వ్యక్తం చేసేందుకు పెదాలను పైకి అనటం ద్వారా ఆభావాన్ని రోబోపిల్లి పలికిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌కు ఒక రూపం రావటానికి చాలా వ్యయ ప్రయాసలతో పాటు, చాలా కాలం పట్టింది. అయితే, సమస్య వచ్చిన ప్రతిసారీ ప్రాజెక్ట్‌కు అవాంతరాలు ఏర్పడటం సహజమే అయినా, ఎమోషనల్‌ (హావభావాలు), లాజిక్‌ సాఫ్ట్‌వేర్‌ను మానవ హావభావాలతో రూపొందించటమే కొంచెం ఆలస్యమైందంటున్నారు.

ఇలా ఏర్పాటుచేసిన అన్నింటినీ ఒకచోటకు చేర్చి ఐక్యాట్‌గా రూపం ఇవ్వటంతో ప్రాజెక్ట్‌కు ఒక రూపం వచ్చింది. అయితే, ఇది ప్రాధమిక స్థాయి మాత్రమే. ఈ రోబో పిల్లికి మరిన్ని మార్పులను తదుపరి దశలో చేయనున్నట్లుగా తెలిపారు. ఎదుటి వ్యక్తి మాట్లాడే మాటను అర్థం చేసుకొని దానికి తగ్గట్లు భావాన్ని సమర్ధవంతంగా పూర్తిస్థాయిలో ముఖంలో పలికించటమే అసలు లక్ష్యం.
ఇప్పటి వరకు అయితే, 22 రకాలైన హావభావాలను రోబోపిల్లి వ్యక్తంచేస్తోందని తెలియజేశారు. కోపం, ఆనందం, భయం, సంతోషం, ఆశ్యర్యం..ఇలా పలు రకాలైన భావాలు వ్యక్తం చేస్తోంది. ఈ రోబో పిల్లి. భవిష్యత్‌లో ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ను మరింతగా వృద్ధి చేస్తే ఈ విధానం అందరికీ ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుందని తెలియజేస్తున్నారు. ఈ విధానం త్వరలో బాగా వృద్ధి చెంది మనకూ అందుబాటులో రావాలని కోరుకుందాము. దీన్ని చిన్న పిల్లలకోసం ఆడుకోవటానికి అభివృద్ధి చేస్తే, అనుకోకుండా అందరికీ బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా రూపుదిద్దుకోవటం ఈ ప్రాజెక్ట్‌ ఎన్ని మలుపులు తిరిగిందో అర్థమౌతోంది.

Post a Comment

1 Comments

Emoji
(y)
:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
:>)
(o)
:p
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
x-)
(k)

Close Menu