Ad Code

అత్యాధునికమైన పరిజ్ఞానాన్ని


 డాల్ఫిన్‌


వాతావరణంలో మార్పులను తెల్సుకోవటానికి శాస్త్రవేత్తలు సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. సముద్ర గర్భంలో ఏర్పడే మార్పుల ఫలితంగా ఒక్కోసారి వాతావరణంలో అనూహ్య పరిణామాలు సంభవించటం జరుగుతున్నాయి. దీంతో సముద్రగర్భంలో శాస్త్రవేత్తలకు అంతుపట్టని రహస్య సమాచారం కోసం కొత్త మార్గాన్ని కనిపెట్టారు. అదేమిటనగా- డాల్ఫిన్‌ తల భాగంలో ప్రత్యేకంగా రూపొందించబడిన సెన్సార్‌లను అమర్చటం ద్వారా వాటిని పర్యవేక్షిస్తూ సముద్రగర్భంలోని మార్పులను సులభంగా తెల్సుకోవచ్చని అంటార్కిటిక్‌ సముద్ర అధ్యయనం చేస్తున్న డేనియల్‌ కోస్టా అనే శాస్త్రవేత్త తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఓషియోగ్రఫీలో ఎంతటి అత్యాధునికమైన పరిజ్ఞానాన్ని వినియోగించినా కొన్ని అంతుచిక్కని రహస్యాలు మిగిలిపోయాయి. అయితే డాల్ఫిన్‌లను వినియోగించటం ద్వారా ఈ సమస్యకు ఓ పరిష్కారం కనుగొనటం కొంతమేర సాధ్యమౌతుందని నిపుణులు అంటున్నారు.

Post a Comment

0 Comments

Close Menu