Header Ads Widget

ఇ-మెయిల్‌ సెక్యూరిటీ విషయాల్లో ప్రత్యేకత కలిగిన పొస్తిని కంపెనీని గూగుల్‌ చేజిక్కించుకుంది.


ఇ-మెయిల్‌ సెక్యూరిటీ విషయాల్లో ప్రత్యేకత కలిగిన పొస్తిని కంపెనీని గూగుల్‌ చేజిక్కించుకుంది. తద్వారా ఇంటర్నెట్‌లో ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్‌కు ఉన్న ఇ-మెయిల్‌ సెక్యూరిటీ విధానానికి ధీటుగా గూగుల్‌ సామర్థ్యం సంతరించుకుందని సంస్థ వెల్లడించింది.


జపాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల సంస్థ పానాసోనిక్‌ డిజిటల్‌ కెమెరాను మార్కెట్‌లో విడుదల చేసింది. ల్యుమెక్స్‌ డిఎమ్‌సి-ఎఫ్‌జడ్‌50 పేరుతో వ్యవహరించే ఈ డిజిటల్‌ కెమెరాలో అత్యుత్తమైన జూమింగ్‌ చేసుకోవచ్చునని తెలిపింది. మ్యానువల్‌గా కూడా అనుకూలమైన విధంగా మార్చుకోవచ్చునని పేర్కొంది. ఇందులో ఫొటోలను ఢఫాీల్ట్‌గా టిఫ్‌ ఫార్మేట్‌లో సేవ్‌ చేసుకునే సౌలభ్యం ఉందని సంస్థ వెల్లడించింది. వీడియోలను సైతం ఎమ్‌పిఈజి4 ఫార్మేట్‌ ద్వారా రికార్డు చేసుకోవచ్చునని సంస్థ తెలిపింది. దీని వెల కూడా మార్కెట్‌లో ఉన్నటువంటి ఇతర డిజిటల్‌ కెమెరాలతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉందని సంస్థ పేర్కొంది. ధర రూ.20,000/-.

ప్రముఖ ఇంటర్నెట్‌ కంపెనీ రీఢఫ్‌ీ డాట్‌ కామ్‌ ఐ-షేర్‌ పేరిట సరికొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. దీని ద్వారా తమ యూజర్లు వీడియోలను, పిక్చర్లను ఇతరులకు పంపించేందుకు ఇది ప్లాట్‌ఫారమ్‌గా ఉపయోగపడుతుందని సంస్థ వెల్లడించింది. ప్రత్యేకించి ఒకే రకమైన అభిప్రాయాలు, అభిరుచులు ఉన్న వ్యక్తులు తమ అభిప్రాయాలను, భావాలను ఒక దగ్గర ప్రదర్శించవచ్చునని పేర్కొంది. దీని ద్వారా భారతీయ యువత తమ ప్రతిభాపాటవాలను ఇంటర్నెట్‌ ద్వారా అందరికీ తెలియజెప్పవచ్చునని తెలిపింది. ఐ-షేర్‌ ద్వారా కేవలం వివిధ రకాలైన యూజర్లే గాక, కంపెనీలు సైతం తమ గురించి వెల్లడించే సౌలభ్యమూ ఉంటుందని తెలిపింది. కంపెనీ సిఇఓ, ఛైర్మన్‌ అజిత్‌ బాలకృష్ణన్‌ మాట్లాడుతూ ప్రస్తుతం పెరుగుతన్న సెల్‌ఫోన్ల వినియోగం ఫలితంగా ఈ సర్వీస్‌కు మంచి స్పందన వస్తుందని భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఈ సర్వీస్‌ యుట్యూబ్‌కు కాపీ కాదని, మరో ప్రత్యేకమైన సర్వీస్‌గా దీన్ని కంపెనీ డైరెక్టర్‌ అగర్వాల్‌ తెలిపారు. త్వరలో రియాలిటీ, టాలెంట్‌ షో 'వాయిస్‌ ఆఫ్‌ రెఢఫ్‌ీ ఆన్‌ జీ సారేగమప' ద్వారా యువతరంలోని టాలెంట్‌ను వెలికి తీస్తామని సంస్థ తెలియజేసింది.

Post a Comment

0 Comments