ఈ సర్వీస్ గురించి బిబిసి డైరక్టర్ జనరల్ మార్క్ ధామ్సన్ మాట్లాడుతూ - ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి వీడియో సర్వీస్‌లకు సైతం సవాలు లాంటిది. ఈ సర్వీస్‌ను ప్రవేశపెడటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది వినియోగదారులకు ఎంతో మేలు చేకూరుతుందని ఆయన అన్నారు.
బిబిసి ఐప్లేయర్..
బిబిసి ఈ సర్వీస్‌ను ఐ-ప్లేయర్ పేరుతో ప్రారంభించింది. దీని వల్ల బిబిసిలో ప్రసారమయిన గత ఏడు సంవత్సరాల వీడియోలను ఇందులోంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవటమే గాక, ఇతర ప్రముఖ టెలివిజన్ ఛానెల్స్‌కు సంబంధించిన వీడియోలు సైతం లభిస్తాయని బిబిసి తెలుపుతోంది. ఇంటర్నెట్‌లో ఇప్పటికే ఉన్నటువంటి యూట్యూబ్, ఇతర వీడియో సర్వీస్‌లకు భిన్నంగా ఈ సర్వీస్ ద్వారా వినియోగదారులు తాము చేరువవుతామని సంస్థ తెలుపుతోంది.
0 Comments