ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో యుద్ధం అనే పదానికి అర్థాలే మారిపోయాయి. దాని
రూపం ఏ విధంగానైనా వుండవచ్చు. శత్రువు కంటికి కనిపించడు. కానీ,
ఆర్థికంగానూ, సాంకేతికపరంగానూ, మానసికంగానూ దెబ్బతీస్తాడు. నేడు ఈ రకమైన
శత్రువులు ప్రతిదేశానికీ సమస్యగా పరిణమించారు. వీరిని రకరకాల పేర్లతో
పిలుస్తుంటారు. కొంతమంది హ్యాకర్స్ అనవచ్చు, మరికొందరు ఆన్‌లైన్
క్రిమినల్స్‌గా అభివర్ణించవచ్చు ఇలాంటి వారి నుంచి జర భద్రం..! ఇటువంటి
శత్రువుల నుంచి భారత్‌కూ ప్రమాదం పొంచివుంది. ఆ శత్రువులు ఎక్కడో లేరు, మన
మధ్యలోనే వుండి, నలుగురిలో తిరుగుతూ ప్రజలకు తెలియకుండా సమాచారాన్ని దొరలా
సేకరిస్తుంటారు. ఇది ఎంతో ప్రమాదకరం. ఈ రకమైన ఆన్‌లైన్ క్రిమినల్స్‌వల్ల
''భవిష్యత్‌లో మన దేశ రక్షణకే ముప్పు వాటిల్లగలదు'' అని భారత మాజీ
రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్ధుల్‌కలాం చాలా కాలం క్రిందటే ప్రభుత్వాలను
హెచ్చరించారు. ప్రత్యేకించి ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న భారతదేశంలో
గూగుల్, యాహూ, ఆర్కుట్, వికీపీడియా వంటి ఇతర సోషల్ వెబ్‌సైట్
కమ్యూనిటీలు, సరళమైన సమాచారం కోసమంటూ పూర్తిస్థాయిలో దేశ రక్షణ సమాచారాన్ని
సేకరించటం- అటు రక్షణశాఖ వర్గాల్లోనూ, ఇతర సైనికవర్గాల్లోనూ తీవ్ర
ప్రకంపనలు పుట్టిస్తోంది. ప్రభుత్వం తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసిన
తర్వాత, అమెరికాలోనూ గూగుల్ సాయంతోనే తీవ్రవాదులు దాడికి ప్రణాళికలు
రూపొందించారనే విషయం బహిర్గతం కావటంతో ఎట్టకేలకు గూగుల్ తన మ్యాప్‌లను
ఉపసంహరించుకొంది. తద్వారా ప్రభుత్వ వర్గాలు కొంతమేరకు పాక్షిక విజయాన్ని
సాధించినా, మరో సోషల్ సైట్ వికీపీడియా కూడా ఇదేరకమైన మ్యాప్‌లను అందించడం
కొంత ఆందోళన కలిగించే విషయమే. అదేమిటంటే- వికీపీడియా అందజేస్తున్న
మ్యాప్‌ల ద్వారా దేశంలోని గ్రామం నుండి పరిశోధనశాలల వరకు గల సమాచారాన్ని
ఇందులో పొందుపరుస్తున్నారు. సైటులో ఆ ప్రాంతానికి సంబంధించిన వివరాలను
ఎప్పటికప్పడు ఎవరైనా ఎడిట్ చేసుకునే సౌలభ్యం ఉన్నా, పాత వివరాలు మాత్రం
డిలీట్ చేయలేరు. కొత్తగా అందజేసే వివరాలను సర్వర్ ఎప్పటికప్పడు అప్‌డేట్
చేస్తుం టుంది. తద్వారా కొత్తగా వచ్చిన వివరాలు పాత వివరాలు క్రోడీకరించి
సంఘ విద్రోహశక్తులు తమకు అనుకూ లంగా చేసుకునే అవకాశాలున్నాయి. ప్రత్యేకించి
ఇలాంటి విషయాలను సులభ ంగా తీసుకోరాదు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే... ఈ
సమాచారాన్నంతా పొందుపరిచేది మనదేశస్తులే కావ టం, అందులోనూ 18నుంచి 32
వయస్సులోపు వారే ఎక్కువగా ఉంటు న్నారు. వీరు తమకు తెలియకుండానే దేశానికి
సంబం ధించిన అత్యంత ముఖ్యమైనటువంటి సమాచారాన్ని శత్రుదేశాలకు అంద
జేస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోమ్‌శాఖ కూడా తీవ్రంగానే
పరిగణిస్తున్నది. ఇదంతా ఒక ఎత్తయితే మరికొన్ని వెబ్‌సైట్ల ద్వారా భారీగా
అశ్లీల కంటెంట్‌ల వినియోగం భారత్‌లో పెరుగుతోంది. ఇలా అశ్లీల కంటెంట్‌లను
వినియోగించటానికి చాలా మందికి గతంలో చాటింగ్ రూమ్‌లు వేదికగా ఉండేవి.
ఇటీవల అసభ్యత ఎక్కువవుతున్న ఛాటింగ్ రూమ్‌లను యాహూ తొలగించటంతో, వీరి
దృష్టి సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ల వైపు మళ్లింది. ఉదాహరణకు
మైస్పేస్.కామ్‌లో గత కొద్దికాలంలో పదివేలకు పైగా అశ్లీల కంటెంట్‌లు
తొలగించటం దీని ప్రభావాన్ని తెలియజేస్తోంది. అంతేగాక అశ్లీల కంటెంట్‌లను
తొలగించడానికి తమ వినియోగదారులకు సైట్ కొద్ది కాలం సమయం ఇచ్చి, తర్వాత తనే
చర్యలు చేపట్టడం, దీని ప్రభావం ఏస్థాయిలో ఉందో తెలియజెప్పకనే చెబుతోంది.
అంతేగాక, సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్లను వినియోగించుకునే ఇటీవల
లండన్‌లోని గ్లాస్కో విమానశ్రయం పేల్చివేతకు కుట్రపన్నాడని బెంగళూర్
డాక్టర్‌ను ఆస్ట్రేలియాలో అరెస్ట్ చేయటం పెద్ద దుమారమే లేపింది. తను తన
సోదరుడితో చాటింగ్‌లో సంభాషించినప్పుడు పంపిన బమ్మల వెనుక ఏదో రహస్య
సందేశాలు ఉన్నాయని ఆస్ట్రేలియా పోలీసుల వాదన. ఎందువల్ల అంటే ఇటీవల కాలంలో
టెర్రరిస్టు గ్రూప్‌లు తమ సమాచారాన్ని ఇతరులకు పంపటానికి ఎక్కువగా బమ్మల
రూపంలోనే చేరవేస్తున్నారనేది నిఘావర్గాల అనుమానం. ప్రత్యేకించి మీ
సెల్‌ఫోన్‌కు ఏదైన ఇమేజి వచ్చి దాన్ని మరో పది మందికి పంపిస్తే మీకు
డబుల్‌టాక్‌టైమ్ లభిస్తుందని ఎస్‌ఎమ్‌ఎస్ వస్తే మాత్రం, మీరు తీవ్రవాదుల
ఉచ్చులోకి లాగబడుతున్నారని అర్థం. ఎందుకు అని ప్రశ్నిస్తే, ఇది తీవ్రవాదులు
తమ సహచరులకు పంపే సందేశాలు అయి ఉండవచ్చు అని భద్రతా అధికారులు
వెల్లడిస్తున్నారు. అలా గ్రూప్‌గా ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపే ముందు ఒకటికి
రెండుసార్లు ఆలోచించాలి. లేకపోతే తమకు తెలియకుండానే తీవ్రవాదులకు సహాయం
చేసినట్లు అవుతుంది. భగవంతుడి బమ్మను పంపి, మరో పది మందికి పంపితే ఆ
దేవాలయం పేల్చివేతకు కుట్రో, లేకపోతే ఆ వర్గానికి చెందిన వారిపై ప్రతీకార
చర్యో, ఇలా రకరకాలైనటువంటి సందేశాలు అందులో పొందుపర్చి ఉండవచ్చు. మీకు
తెలియకుండానే భగవంతుని బమ్మ కదా అని మీరు పంపిస్తే దేశద్రోహం కింద మీరు
చిక్కుకుపోయే ప్రమాదమూ లేకపోలేదు. ప్రస్తుతం ఈ హ్యాకర్స్ తాకిడి
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌కూ తాకింది. ఇది ఏ స్థాయిలో అంటే-
మైస్పేస్.కామ్ వినియోగదారులను ప్రధాన లక్ష్యంగా చేసుకొని హ్యాకర్స్ దాడి
చేయటం, వినియోగదారుల వ్యక్తిగత వివరాలు ఇతరుల చేతుల్లోకి వెళ్లటంతో సోషల్
నెట్‌వర్కింగ్ సైట్స్‌లోనూ లోపాలు బయట పడటం ప్రధానాంశం. తస్మాత్
జాగ్రత్త.
0 Comments