Ad Code

నోకియా, మోటోరోలా బ్యాటరీలు ఫెయిల్యూర్‌..


ప్రముఖ అగ్రగామి సెల్‌ఫోన్‌ తయారీ సంస్థలైన నోకియా, మోటోరోలాకు చెందిన బ్యాటరీలు తాజాగా నిర్వహించిన భద్రతా పరీక్షల్లో ఫెయిల్యూర్‌అయ్యాయని అమెరికాకు చెందిన వార్తా పత్రిక ఒకటి వెల్లడించింది. గతంలో బ్యాటరీలు పేలటానికి సెల్‌ఫోన్‌ వినియోగదారుడి నిర్వహణా లోపంగా కంపెనీలు వెల్లడించాయి. కాగా, ప్రస్తుతం ఈ వార్తా కథనం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ బ్యాటరీలు పేలి ప్రమాదం సృష్టించే అవకాశాలు ఉన్నాయని వెల్లడైంది. ఇంటర్నెషనల్‌ హెర్లాక్ట్‌ టర్బెన్‌చే దక్షిణ గువాంగ్‌డంగ్‌ ప్రావిన్స్‌లో ఉన్న ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రం చైనీస్‌ రెగ్యులేటర్స్‌ వారు పరీక్షలను నిర్వహించి ఈ విషయాన్ని తెలియజేసినట్లు పత్రిక పేర్కొంది. దీనిపై మోటోరోలా కంపెనీ ప్రతినిధి యాంగ్‌ బోనింగ్‌ బీజింగ్‌లో మాట్లాడుతూ- చైనాలో పరీక్షలు నిర్వహించిన బ్యాటరీలు తమ కంపెనీకి చెందినవి కాదని పేర్కొన్నారు. తమ ఒరిజనల్‌ బ్యాటరీలను మార్కెట్‌ నుంచి సేకరించకుండా, డూప్లికేట్‌ బ్యాటరీల ద్వారా పరీక్షించారని, తమపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. నోకియా సైతం ఇదే విధమైన ప్రకటనను జారీ చేసింది. అంతేగాక నోకియా చైనాలో ఎటువంటి బ్యాటరీలు తయారు చేయటం లేదని తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu