Ad Code

అమెరికాకు చెందిన స్పామర్‌ క్రిస్టోఫర్‌ 30 సంవత్సరాల జైలుశిక్ష



ఐక్యరాజ్యసమితికి(యుఎన్‌) చెందిన అధికారిక వెబ్‌సైట్‌ను సైతం హ్యాకర్స్‌ హ్యాకింగ్‌ చేశారు. దీంతో యుఎన్‌ వెబ్‌సైట్‌ను చాలా సేపు ఆఫ్‌లైన్‌లో ఉంచాల్సి వచ్చింది. ప్రత్యేకించి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ బాన్‌మూన్‌ ఇజ్రాయిల్‌ దాడులపై వ్యాఖ్యానించిన తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. యుఎన్‌ వెబ్‌సైట్‌ స్క్రీన్‌ మీద అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలు అమాయకులైన పసివారిని యుద్ధం పేరుతో కర్కశంగా చంపేస్తున్నారు. భవిష్యత్‌లో ఈ దేశాలు మరింతగా దెబ్బతింటాయని హ్యాకర్స్‌ అందులో హెచ్చరించారు. హ్యాకర్స్‌ తమపేర్లను కెర్మ్‌125, గ్రిసీ, మోస్ట్‌డ్‌గా వర్ణించుకున్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయిల్‌కు చెందిన ఇతర వెబ్‌సైట్స్‌ను సైతం హ్యాకర్స్‌ హ్యాకింగ్‌ చేశారు.

నకిలీ పాస్‌పోర్ట్స్‌ అరికట్టడానికి సరికొత్త విధానంతో (ఆర్‌ఎఫ్‌ఐడి చిప్స్‌తో) రూపొందించిన పాస్‌పోర్ట్‌లను సైతం హ్యాకర్స్‌ డీకోడింగ్‌ చేస్తున్నారు. ఈ ఆర్‌ఎఫ్‌ఐడి చిప్స్‌తో తయారుచేసిన పాస్‌పోర్ట్స్‌ విధానం ఎంతగానో ప్రసిద్ధి చెందుతున్న సమయంలోనే ఈ సంఘటన వెలుగులోకి రావటంతో వీటి భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. దీంట్లో చిప్‌ అమర్చటం ద్వారా పాస్‌పోర్ట్‌ను సులభంగా రీడ్‌ చేయటం, కొత్తగా డేటాను అప్‌లోడ్‌ చేయటం చేయవచ్చు. రిమోట్‌ విధానం ద్వారా డేటాను ఎప్పటికప్పడు పరిశీలించవచ్చు. కానీ, ఆర్‌ఎఫ్‌ఐడి చిప్‌ను క్రాక్‌చేయటం వల్ల, దాన్ని పోలినటువంటి మరో చిప్‌ను రూపొందించటం సులభమైంది. దీనిపై భద్రతా నిపుణులు మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.

అమెరికాకు చెందిన స్పామర్‌ క్రిస్టోఫర్‌ రిజ్‌లెర్‌ స్మిత్‌కు ఫెడరల్‌ కోర్టు 30 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. స్మిత్‌ గత సంవత్సరం ఏఓఎల్‌(అమెరికా ఆన్‌లైన్‌)కు ఏకకాలంలో బిలియన్‌ల సంఖ్యలో స్పామ్‌ మెయిల్స్‌ను పంపి సర్వీస్‌ను స్తంభింపజేశాడు. దీనివల్ల ఏఓఎల్‌ భారీ ఎత్తున సర్వర్స్‌ను డౌన్‌చేసుకొంది. అంతేగాక, గత సంవత్సరం ఆన్‌లైన్‌ వ్యాపార లావాదేవీలు మొత్తం మీద 18 మిలియన్‌ డాలర్ల మేరకు నష్టపోయినట్లు ఇతనిపై అభియోగాలు నమోదు చేశారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనూ 85శాతం మేర స్పామ్‌ మెయిల్స్‌ పంపి, వెబ్‌ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినట్లు నిరూపించారు.

Post a Comment

0 Comments

Close Menu