Ad Code

మొబైల్‌ ఇంటర్నెట్‌ మనకు కేవలం వినోదం కోసమేనా?


మొబైల్‌ ఫోన్లలో ఇంటర్నెట్‌ వినియోగం ఇప్పుడు ప్రాచుర్యంలోకి వస్తున్న విషయం తెలిసిందే. అమెరికా, ఐరోపా మార్కెట్‌ల వినియోగదారులు ఈ మొబైల్‌ ఇంటర్నెట్‌ను సమాచారం, వార్తా సేకరణ కోసం ఉపయోగిస్తుండగా భారతీయులు మాత్రం దీనిని కేవలం వినోద సాధనంగా మాత్రమే చూస్తున్నారట!. భారత్‌, చైనా, ర'ా్య, బ్రెజిల్‌ తదితర దేశాల వినియోగదారులు మొబైల్‌ ఇంటర్నెట్‌లో ఎక్కువగా వినోదం ఆధారిత వెబ్‌సైట్లను మాత్రమే సందర్శిస్తున్నారని నీల్‌సెల్‌ అనే సంస్థ తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ దేశాలలో వినియోగదారులు ఎక్కువగా సందర్శించే వాటిలో వినోదం, గేమింగ్‌, మ్యూజిక్‌ ఆధారిత వెబ్‌సైట్లు మాత్రమే టాప్‌ 5 ర్యాంకింగ్‌లో వున్నట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే అమెరికా, ఐరోపా దేశాలల్లో ఈ సైట్లు కనీస ర్యాంకింగ్‌కు కూడా నోచుకోకపోవటం గమనార్హం. భారత్‌ తదితర దేశాల్లో మొబైల్‌ ఇంటర్నెట్‌ వినియోగదారులు తమ మొబైల్‌ ఫోన్లను ఎక్కువగా వినోదాత్మక సమాచారం కోసం వినియోగిస్తుంటే అమెరికా, ఐరోపా వినియోగదారులు తమ ఫోన్లను ఇ-మెయిల్‌, వాతావరణ విశే'ాలు, వార్తలు, సెర్చింగ్‌ తదితర అంశాలకు ఉపయోగిస్తున్నారు. ఐపాడ్‌ల వంటి ప్రత్యేక వినోద సాధనాలు అందుబాటులో వుండటంతో మొబైల్‌ ఇంటర్నెట్‌పై ఈ దేశాల్లో వినోదానికి ఆదరణ పెరగటంలేదని నీల్‌సెల్‌ సంస్థ చెబుతుంది. మొబైల్‌ ఇంటర్నెట్‌ వినియోగం కేవలం1.8 శాతం మాత్రమే నమోదయిన భారత్‌ ఈ విషయంలో బాగా వెనుకబడి వున్నప్పటికీ మొబైల్‌ ఫోన్ల ద్వారా డేటా సేవలను అందుకోవటం భారత్‌, ర'ా్య, చైనా, బ్రెజిల్‌ దేశాల ఆర్ధిక వ్యవస్థలపై అద్భుతమైన సానుకూల ప్రభావం చూపుతుందని ఆ సంస్థ అభిప్రాయపడుతుంది.

Post a Comment

0 Comments

Close Menu