ప్రముఖ సెల్‌ఫోన్ తయారీ సంస్థ నోకియా వరుసగా విఫలమవుతున్న హై ఎండ్ మోడల్స్ కోసమని మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
దీనివల్ల
మైక్రోసాఫ్ట్‌కు చెందిన యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ వల్ల సెల్‌ఫోన్స్‌కు
వచ్చే వైరస్ నుంచి రక్షణ పొందటం సాధ్యమౌతుందని, అంతేగాక ఈ ఒప్పంద ఫలితంగా
మైక్రోసాఫ్ట్‌కు చెందిన అనేకరకాలైనటువaి వైర్‌లెస్ ఎంటర్‌టైన్‌మెంట్
కంటెంట్‌లను ఉదాహరణకు మ్యూజిక్, వీడియోలను ఇంటర్నెట్ నుంచి సులభంగా
సర్ఫ్ చేసుకోవటానికి వీలవుతుందిని నోకియా వెల్లడించింది. డిజిటల్ రైట్స్
మేనేజ్‌మెంట్ టెక్నాలజీని నోకియాకు మైక్రోసాఫ్ట్ బదలాయింపు చేస్తుందని
తెలిపింది. తద్వారా వచ్చే ఎస్40 మోడల్స్‌లో ఈ టెక్నాలజీని నోకియా
వినియోగించనున్నట్లు సంస్థ పేర్కొంది. దీనివల్ల భవిష్యత్‌లో ఇరు సంస్థలూ
కలసి మరింతగా పరిశోధనలు చేసే అవకాశాలున్నట్లు తెలియజేశాయి.
0 Comments