సెల్‌ఫోన్ ద్వారా తాము ఎంపిక చేయదలుచుకున్న రంగును మల్టీమెసేజింగ్‌ను వినియోగించి ప్రొడక్ట్‌ను ఫొటోగా (ఎమ్‌ఎమ్‌ఎస్‌ను) పంపటం ద్వారా ఎంచుకున్న రంగును కంప్యూటర్ విశ్లేషించి అది సరైనదో, కాదో తిరిగి వినియోగదారునికి సమాధానం స్వల్ప వ్యవధిలో పంపుతుంది. ఉదాహరణకు మీరు మీ ఇంటికి కాఫీ రంగులో ఉన్నటువంటి పెయింట్‌ను వేద్దామనుకున్నారు. కానీ అందులో వేల రకాలైనటువంటి ఆప్షన్లు ఉన్నాయి. మీరు ఎంచుకున్న రంగు బూడిద రంగులో ఉంది. అది మీరు అనుకున్నదో, కాదో తెల్సుకోవాలనుకంటే ఎమ్‌ఎమ్‌ఎస్‌ను హెచ్‌పి సర్వర్‌కు పంపటం ద్వారా మీరు ఎంచుకున్నది ఏ రంగో, మీరు ఏ రకమైన వర్ణాన్ని ఎంచుకోవాలో తెలియజేస్తుంది. అంతేగాక, దీని సాయంతో ఏయే రంగులను కలిపితే మీకు కావాల్సిన రంగు లభ్యమౌతుందో సైతం తెలుసుకునే సౌలభ్యం ఉందని సంస్థ తెలిపింది.
దీని గురించి నీనా బాటీ, ఆమె బృందం మరిన్ని విషయాలు వెల్లడిస్తూ - కేవలం ఈ ప్రాజెక్టులో రంగుల ఎంపికే గాక, వినియోగదారుడి చర్మం బట్టి తాము ఏరకమైనటువంటి మేకప్ వాడాలో ఎంత మేకప్ చేయాలో తెలియజేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసినట్లు తెలియజేసింది. చాలా వరకు మహిళలు చర్మ సౌందర్యసాధనాలను కొనుగోలు చేసేముందు కాస్మొటిక్ నిపుణుల అభిప్రాయం తీసుకోరు. దీనివల్ల చర్మసంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో 75శాతం మంది మహిళలకు తాము ఏరకమైన మేకప్ వేసుకొన్నారో, అది తమకి సరైనదో, కాదో తెలియదని తెలిపారు. దీనిపై జరిగిన అధ్యయనంలో కాస్మొటాలజిస్ట్‌లు ఏ రకమైన డ్రగ్స్‌తో ఉన్నటువంటి మేకప్స్‌ను ఎలా వినియోగించాలో ఒక కేటలాగ్‌ను విడుదల చేశారు. అయితే చర్మ సౌందర్యానికి వినియోగించే మేకప్‌లో రంగులు ఏవి ఆ చర్మానికి సరిపోతుందో వెల్లడించలేదు. ఆ సమస్యను తాము అధిగమించగలిగినట్లు నీనా బాటీ బృందం వెల్లడించింది.

అది ఎలాగంటే..హెచ్‌పిలో తాము ప్రోటోటైప్ ద్వారా ప్రత్యేకమైన విధానాన్ని అభివృద్ధి చేశామని దానికి ఎవరైతే మేకప్ వాడాలని నిర్ణయించుకుంటారో, వారి ఫొటోను హెచ్‌పి సర్వీస్‌కు పంపటం ద్వారా ఏ రంగును ఎంపిక చేసుకోవాలో వెల్లడిస్తుంది. అంతేగాక వారికి ఏ మేర ఎలా మేకప్ చేయాలో చిట్కాలను సైతం సర్వర్ ఆటోమ్యాటిక్‌గా అందజేస్తుంది అని ఆమె తెలియజేశారు. దీనిపై ఇప్పటికే 260 మందికి పైగా మహిళల చర్మానికి సంబంధించిన మార్పులను ప్రయోగాత్మకంగా పరిశీలించిన పిదప, ప్రయోగం విజయవంతం అయిందని ఆమె తెలిపారు. దీని కోసం ఆరోగ్యకమైన చర్మం తీరు ఎలా ఉంటుందో, అటువంటి చర్మానికి ఏరకమైనటువంటి మేకప్‌ను వినియోగించాలి అన్నదానిపై ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసినట్లు ఆమె తెలిపారు. అంతేగాక, మహిళల చర్మం వాతారణ కాలుష్యానికి, పని వల్ల ఏర్పడే ఒత్తిడికి గురి అవుతుంది. కానీ, కార్పొరేట్ ఆఫీసుల్లో పనిచేసే మహిళల ముఖంలో ఒత్తిడి ఛాయలు కన్పించకుండా మేకప్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అటువంటి వారికి ఏరకమైన మేకప్ నప్పుతుందో దీని ద్వారా తెల్సుకోవచ్చు. దీనిపై పూర్తి వ్యాస్యాన్ని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇమేజింగ్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీలో ప్రచురితమౌనట్లు ఆమె పేర్కొన్నారు. అంతేగాక, భవిష్యత్తులో టెక్నాలజీలో మరిన్ని మార్పులు చేర్పులు సంభవిస్తాయని ఇందులో ఏమైనా లోపాలు ఉన్నా అవి త్వరలో సమసిపోగలవన్నారు. అయితే ఈ టెక్నాలజీని వెంటనే మార్కెట్‌లో విడుదల చేసి సంపాదించాలని అనుకోవటం లేదని, పూర్తిస్థాయి ఫలితాలు వచ్చాక దీన్ని విడుదల చేస్తామని ఆమె అంటున్నారు.