Search This Blog
Tuesday, June 29, 2021
జియో 3,499
Monday, June 28, 2021
గ్రూప్ వీడియో కాల్స్ !
గ్రూప్ వీడియో కాల్స్ ఆప్షన్‌ను టెలిగ్రామ్ తీసుకొచ్చింది. ఆన్లైన్ క్లాసులకు, వ్యాపార సమావేశాలకు, మీటింగ్‌లకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. కొత్తగా యానిమేటెడ్ ఎమోజీలు, థర్డ్‌పార్టీ స్టిక్కర్లను ఇంపోర్ట్ చేసుకునే సదుపాయం కూడా వచ్చింది. అలాగే స్క్రీన్ షేరింగ్, నాయిస్ సస్పెన్షన్, యానిమేటెడ్ బ్యాంక్గ్రౌండ్ లాంటి సూపర్ ఫీచర్లను టెలిగ్రామ్ ప్రవేశపెట్టింది. ఏదైనా గ్రూప్‌లో యాక్టివ్ సెషన్లో ఉన్నప్పుడు 'షేర్ మై వీడియో' అనే ఆప్షన్‌ను క్లిక్ చేయడం ద్వారా టెలిగ్రామ్‌లో గ్రూప్ వీడియోకాల్స్ చేయవచ్చు. ప్రస్తుతానికి వాయిస్ చాట్‌లో యాడ్ అయిన మొదటి 30 మంది వీడియో కాల్లో యాడ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ పరిమితిని త్వరలోనే పెంచుతామని టెలిగ్రామ్ ప్రకటించింది. అలాగే గేమ్స్ స్ట్రీమింగ్, లైవ్ ఈవెంట్స్‌తో పాటు మరిన్ని సదుపాయలు తీసుకొస్తామని చెప్పింది. దీంతో వాట్సాప్‌కు గట్టిపోటీగా నిలవచ్చని టెలిగ్రామ్ భావిస్తోంది.
Friday, June 25, 2021
రియల్‌మీ కొత్త స్మార్ట్ టీవీ
మైక్రోసాఫ్ట్ విండోస్ 11
మైక్రోసాఫ్ట్ తన తర్వాతి తరం విండోస్ ఆపరేటింగ్ సిస్టంనే తీసుకువచ్చింది. అదే విండోస్ 11. ఒక వర్చువల్ ఈవెంట్‌లో మైక్రోసాఫ్ట్ దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా మైక్రోసాఫ్ట్ తన డిజైన్ లాంగ్వేజ్‌ను సులభతరం చేసింది. దీంతో విండోస్ 11 చాలా మోడ్రన్‌గా ఫ్రెష్‌లుక్‌తో కనిపిస్తుంది.
ఇందులో స్నాప్ లేఅవుట్స్, స్నాప్ గ్రూప్స్‌తో పాటు మల్టీ టాస్కింగ్ కోసం డెస్క్‌టాప్‌ను కూడా కొత్త తరహాలో డిజైన్ చేసింది. మన వర్క్ ప్రిఫరెన్సెస్ ప్రకారం వేర్వేరు డెస్క్‌టాప్‌లను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మాక్ఓఎస్, క్రోమ్ఓఎస్‌లకు పోటీని ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ కూడా కొన్ని మార్పులను తీసుకువచ్చింది. స్టార్ట్ మెనూ గతంలో లాగా ఎడమ వైపు నుంచి కాకుండా మధ్యలో ఉండనుంది. విండోస్ 10లో ఉండే లైవ్ టైల్స్‌ను ఇందులో తీసేశారు. ఇందులో అలెర్ట్స్, నోటిఫికేషన్లకు ప్రత్యేకమైన సౌండ్లు అందించనున్నారు. కొత్త థీమ్స్, కొత్త వాల్ పేపర్స్, మెరుగైన డార్క్‌మోడ్‌ను ఇందులో అందించారు. వీటిలో విడ్జెట్ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా అప్‌డేట్ చేశారు.
విండోస్ 11లో మెరుగైన టచ్ కీబోర్డు కూడా ఉంది. జిఫ్ ఫీచర్‌ను కూడా అందించారు. దీంతోపాటు వాయిస్ డిక్టేషన్, వాయిస్ కమాండ్స్ కూడా ఇందులో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ ఇందులో టచ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా ఎన్‌హేన్స్ చేసింది. విండోస్ 10లో టచ్ కమాండ్స్‌పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వీటిని ఇందులో మెరుగు పరిచారు.
దీంతోపాటు టీమ్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలను డీఫాల్ట్‌గా అందిస్తున్నారు. దీంతో ఇందులో మ్యూట్ అండ్ అన్‌మ్యూట్ ఫీచర్లు కూడా ఉండనున్నాయి. ఎడ్జ్ బ్రౌజర్‌కు కూడా ఇందులో పలుమార్పులు చేశారు. గేమర్ల కోసం పలు ఫీచర్లను మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆటో హెచ్‌డీఆర్ సపోర్ట్, డైరెక్ట్ఎక్స్ 12 అల్టిమేట్, ఎక్స్‌క్లౌడ్ ఇంటిగ్రేషన్‌లు ఇందులో ఉన్నాయి. క్లౌడ్ గేమింగ్, ఎక్స్‌బాక్స్ గేమ్ పాస్ యాక్సెస్‌ను ఎక్స్‌క్లౌడ్ ఇంటిగ్రేషన్ ద్వారా పొందవచ్చు. మైక్రోసాఫ్ట్ స్టోర్‌ను కూడా ఇందులో మెరుగుపరిచారు. సెర్చ్ సామర్థ్యాన్ని పెంపొందించడమే, డిజైన్‌కు కూడా మెరుగులు దిద్దారు. దీంతోపాటు డెవలపర్ల కోసం జీరో రెవిన్యూ షేర్ పద్ధతిని మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తీసుకువచ్చింది. అంటే మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో ఉండే యాప్స్‌కు వచ్చే రెవిన్యూ నుంచి కంపెనీ ఒక్క రూపాయి కూడా తీసుకోదన్న మాట. ఇది జులై 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆండ్రాయిడ్ యాప్స్ సపోర్ట్ కోసం అమెజాన్ యాప్ స్టోర్‌ను కూడా మైక్రోసాఫ్ట్ ఇందులో ఇంటిగ్రేట్ చేయనుంది. ఇందుకోసం ఇంటెల్ బ్రిడ్జ్ టెక్నాలజీని ఉపయోగించనుంది. మొబైల్ డివైస్‌లపై మెరుగైన బ్యాటరీని అందించనున్నామని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
Thursday, June 24, 2021
స్మార్ట్ ఫోన్' జియోఫోన్ నెక్ట్స్
రిలయన్స్ జియో ప్రపంచంలో 'అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్' జియోఫోన్ నెక్ట్స్ ను గూగుల్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసినట్లు .రిలయన్స్ 44వ వార్షిక సమావేశంలో ముఖేష్ అంబానీ ప్రకటించారు. వినాయక చవితి నుంచి (సెప్టెంబరు 10) ఈ ఫోన్ అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు.
జియోఫోన్ నెక్ట్స్ గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సహాయంతో పనిచేస్తుంది. దీనిలో వాయిస్ అసిస్టెంట్, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ పనిచేయనున్న కెమెరా, లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్ వంటి మరెన్నో ఫీచర్స్ తో వచ్చింది. దీనిని మొదట భారతదేశంలో ప్రారంభించనున్నారు. తర్వాత ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. దీని ధర ఎంత అనేది సంస్థ ఇంకా ప్రకటించలేదు. రిలయన్స్ జియోకు దేశంలో 425 మిలియన్లకు పైగా చందాదారులు ఉన్నారు. భారతదేశంలో డేటా వినియోగంలో కంపెనీ 45% వృద్ధిని నమోదు చేసింది. త్వరలో 200 మిలియన్ల కొత్త వినియోగదారులు చెరనున్నట్లు రిలయన్స్ జియో భావిస్తుంది. దేశంలో ఇప్పటికీ 30 కోట్ల మంది 2జీ ఫోన్ నే వాడుతున్నారు. వారిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఈ ఫోన్ తీసుకొచ్చినట్లు జియో తెలిపింది.
Tuesday, June 22, 2021
ఎలక్ట్రిక్ బస్సుల ప్రత్యేకతలు!
డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీపై నిర్వహణ వ్యయం ఎక్కువైంది. డీజిల్ బస్సుల కంటే ఎలక్ట్రిక్ బస్సులతో నిర్వహణ వ్యయం తగ్గుతుంది. ఎలక్ట్రిక్ బస్సుల ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా ఆమోదించిన ప్రభుత్వం. వాటి ప్రత్యేకతలు తెలుసుకుందాం !
తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డులో ప్రయాణం కోసం 9 మీటర్ల పొడవున్న బస్సులు.. మిగిలిన చోట్ల 12 మీటర్ల పొడవున్న బస్సులు నడపాలని నిర్ణయించారు. 9 మీటర్లు పొడవున్న బస్సు ధర రూ.1.25 కోట్లు, 12 మీటర్ల పొడవున్న బస్సు ధర రూ.1.50 కోట్లు. కేంద్ర ప్రభుత్వం ‘ఫాస్టర్ అడాప్షన్ మాన్యూఫాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఫేమ్) పథకం కింద 9 మీటర్ల బస్సుకు రూ.45 లక్షలు, 12 మీటర్ల బస్సుకు రూ.55 లక్షల రాయితీ ఇస్తుంది. విశాఖపట్నంలో బస్సు ఫ్లోర్ భూమి నుంచి 40 సెంటీమీటర్ల ఎత్తులో.. మిగిలిన చోట్ల 90 సెంటీమీటర్ల ఎత్తులో ఉండేవి నడపనున్నారు.
డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీపై నిర్వహణ వ్యయం ఎక్కువైంది. డీజిల్ బస్సుల కంటే ఎలక్ట్రిక్ బస్సులతో నిర్వహణ వ్యయం తగ్గుతుంది. రోజుకు 300 కిలోమీటర్లు ప్రయాణం చేసే 12 మీటర్ల పొడవున్న డీజీల్ ఏసీ బస్సుకు కి.మీ.కి రూ.52 ఖర్చవుతుంది. అదే ఎలక్ట్రిక్ ఏసీ బస్సుకు రూ.48 అవుతుంది. ఇక 9 మీటర్ల పొడవు ఉన్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సుకు కి.మీ.కు రూ.45 అవుతుంది. ప్రస్తుతం ఆర్టీసీలో 9 మీటర్ల పొడవున్న డీజిల్ బస్సులు లేవు. ఎలక్ట్రిక్ బస్సులతో కాలుష్యం విడుదల కాదు, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. ఈ బస్సుల నిర్వహణ కోసం ఆర్టీసీ డిపోల్లోనే అవకాశం కల్పించి, నిర్వాహకుల నుంచి చార్జీలను వసూలు చేస్తారు.
ఎలక్ట్రిక్ బస్సుల ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా ఆమోదించిన ప్రభుత్వం.. జ్యుడిషియల్ ప్రివ్యూకు నివేదించమని ఆర్టీసీని ఆదేశించింది. ఆర్టీసీ అధికారులు ఒకటి రెండు రోజుల్లో జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపనున్నారు. అక్కడ ఆమోదం లభించిన అనంతరం టెండర్ల ప్రక్రియ చేపడతారు. పర్యావరణ పరిరక్షణ కోసం సంప్రదాయేతర ఇంధన వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ముందడుగు వేస్తూ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఆర్టీసీకి అనుమతి ఇచ్చింది.
Wednesday, June 16, 2021
ఏపీ ఫైబర్ నెట్ వై-ఫై పాస్వర్డ్ మార్చడం ఎలా??
ఏపీ ఫైబర్ నెట్ ఇంటర్నెట్ వాడుతున్నారా?? కాని మీకు ఇంటర్నెట్ స్లో గా వస్తుందా ?? అయితే మీ ఇంటర్నెట్ ని మీకు తెలియకుండా ఎవరో వాడుతున్నట్లే.

ఇప్పుడు ఫైబర్ నెట్ లో SSID & వై-ఫై పాస్వర్డ్ ఎలా మార్చుకోవాలో చూద్దాం.
ముందుగా మీ వై-ఫై యొక్క IP అడ్రస్ ను మెనూ లోని MY Account ఓపెన్ చేసి STB info ని ఓపెన్ చేయండి. అక్కడ IP Address ఎదురుగా 192.168.55.102 అనే నంబర్స్ ను నోట్ చేస్కొండి. (ఒక్కో రౌటర్ లో ఒక్కో IP Address వేరు గా ఉండవచు.)
IP అడ్రస్ లోని 192.168.55.102 లో చివరి 102 లేకుండా 1 ను రీప్లేస్ చేయండి. అంటే 192.168.55.1 ఇది మీ వై-ఫై యొక్క డిఫాల్ట్ అడ్మిన్ లాగిన్ అడ్రస్.
ఏపీ ఫైబర్ నెట్ ను ఎవరెవరు వాడుతున్నారో తెల్సుకోవడం ఎలా??
App Store లోకి వెళ్లి Social మెనూ లో క్రోమ్ బ్రౌసర్ ఓపెన్ చేయండి.
అడ్రస్ బార్ లో 192.168.55.1 ఎంటర్ చేసి గో ప్రెస్ చెయ్యండి. మీకు Dasan లాగిన్ పేజి వస్తుంది. డిఫాల్ట్ లాగిన్ ID లో admin, అండ్ password లో vertex25 ఎంటర్ చేసి లాగిన్ అవండి.
మీకు రైట్ సైడ్ లో GPON Home Gateway కింద Status క్లిక్ చెయ్యండి.మీ ఇంటర్నెట్ ను ఎవరెవరు వాడుతున్నారో Current Wireless Users లో MAC అడ్రస్ తో సహా చూడొచ్చు.
ఏపీ ఫైబర్ నెట్ వై-ఫై లాగిన్ పాస్వర్డ్ మార్చటం ఎలా??
మీకు రైట్ సైడ్ లో GPON Home Gateway కింద Maintenance ఓపెన్ చేసి Adiministrator సెక్షన్ లో New Password లో మీ కొత్త పాస్వర్డ్ ని ఎంటర్ చేసి మళ్లి Confirm password లో మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి కిందకి స్క్రోల్ చేసి Apply క్లిక్ ivandi.మీరు 30 సెకండ్స్ తర్వాత లాగౌట్ అయపోతారు.సో మళ్లి లాగిన్ లో ID admin అండ్ Password లో కొత్త పాస్వర్డ్ తో లాగిన్ అవండి.
ఏపీ ఫైబర్ నెట్వై వై-ఫై పేరు & పాస్వర్డ్ మార్చటం ఎలా??
మీకు రైట్ సైడ్ లో GPON Home Gateway కింద Wifi Setup ఓపెన్ చేసి Wifi 2.4Ghz Settings సెక్షన్ లో SSID Settings lo SSID బాక్స్ లో మీ వై-ఫై కి పేరు ఏం కావాలో ఎంటర్ చేయండి.ఇంకా Authentication Type ని WPA2PSK కి, Use WPS ని Deactivated కి మార్చండి.
WPA-PSK సెక్షన్ లో
Pre-Shared Key లో మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి.(15 అంకెలు ఉంచడం మంచిది). చివరగా
Apply చేసి మీ మొబైల్స్ అన్నిట్లో కొత్త పాస్వర్డ్ తో కనెక్ట్ అవ్వండి.
Thursday, June 10, 2021
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...