Ad Code

స్మార్ట్ ఫోన్' జియోఫోన్ నెక్ట్స్

 

రిలయన్స్ జియో ప్రపంచంలో 'అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్' జియోఫోన్ నెక్ట్స్ ను  గూగుల్ భాగస్వామ్యంతో  అభివృద్ధి చేసినట్లు .రిలయన్స్ 44వ వార్షిక సమావేశంలో ముఖేష్ అంబానీ ప్రకటించారు. వినాయక చవితి నుంచి  (సెప్టెంబరు 10) ఈ ఫోన్ అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు. 

జియోఫోన్ నెక్ట్స్ గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సహాయంతో పనిచేస్తుంది. దీనిలో వాయిస్ అసిస్టెంట్, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ పనిచేయనున్న కెమెరా, లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్ వంటి మరెన్నో ఫీచర్స్ తో వచ్చింది. దీనిని మొదట భారతదేశంలో ప్రారంభించనున్నారు. తర్వాత ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. దీని ధర ఎంత అనేది సంస్థ ఇంకా  ప్రకటించలేదు. రిలయన్స్ జియోకు దేశంలో 425 మిలియన్లకు పైగా చందాదారులు ఉన్నారు. భారతదేశంలో డేటా వినియోగంలో కంపెనీ 45% వృద్ధిని నమోదు చేసింది. త్వరలో 200 మిలియన్ల కొత్త వినియోగదారులు చెరనున్నట్లు రిలయన్స్ జియో భావిస్తుంది. దేశంలో ఇప్పటికీ 30 కోట్ల మంది 2జీ ఫోన్ నే వాడుతున్నారు. వారిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఈ ఫోన్ తీసుకొచ్చినట్లు జియో తెలిపింది. 

Post a Comment

0 Comments

Close Menu