Ad Code

రూ.100 లోపు ప్లాన్స్‌పై ఎస్​ఎమ్​ఎస్ ల రద్దు


అన్ని ప్రముఖ మొబైల్​ నెట్​వర్క్​లు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎంట్రీ లెవల్​ ప్లాన్లను రద్దు చేస్తూ యూజర్లను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఎయిర్​టెల్​ తన ఎంట్రీ లెవల్​ రూ. 49 ప్లాన్​ను రద్దు చేసి దాని స్థానంలో రూ. 79 ప్లాన్​ను ప్రవేశపెట్టింది. వొడాఫోన్​, జియో సంస్థలు కూడా ఎంట్రీ లెవల్​ ప్లాన్ల కింద లభించే బెనిఫిట్స్​ తగ్గించేందుకు సిద్ధమవుతున్నాయి. రూ. 100లోపు లభించే ప్లాన్లపై ఉచిత బండిల్​ ఎస్​ఎమ్​ఎస్​లను రద్దు చేసే ప్లాన్​లో ఉన్నాయి. మరికొద్ది రోజుల్లోనే అన్ని టెలికాం ఆపరేటర్లు దీన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఇవి అమల్లోకి వస్తే ఇకపై ఎంట్రీ లెవల్​ ప్లాన్లపై ఎస్​ఎంఎస్​ ప్రయోజనాలను పొందలేరు. ప్రస్తుతం అన్ని టెలికాం ఆపరేటర్లు ఎంట్రీ లెవల్ ప్యాకేజీల్లో భాగంగా తక్కువ ధర వద్దే ఇంటర్నెట్, అన్​లిమిటెడ్​ కాలింగ్​. ఎస్​ఎమ్​ఎస్​తో కూడిన బండిల్ ప్యాకేజీని అందిస్తున్నాయి. అయితే, రాబోయే రోజుల్లో ఈ బండిల్​ ప్యాక్​కింద ఉచిత ఎస్​ఎమ్​ఎస్ ఫెసిలిటీని తొలగించనున్నాయి. ఇప్పటికే, ఎయిర్​టెల్​ ఈ ప్రక్రియను ప్రారంభించింది. ఎయిర్‌టెల్ ఇటీవల రూ. 49 విలువల గల ఎంట్రీ లెవల్​ ప్రీపెయిడ్​ ప్లాన్​​ను రద్దు చేసి దాని స్థానంలో రూ. 79 ప్లాన్​ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్​ కింద 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 64 టాక్‌టైమ్, 200MB డేటా అందిస్తుంది.

ఎయిర్‌టెల్ మరో ఎంట్రీ లెవర్ ప్లాన్ రూ. 64 కింద 28 రోజుల పాటు 200MB డేటా మాత్రమే ఇస్తుంది. ఈ రెండు ప్లాన్లలోనూ ఉచిత ఎస్ఎమ్ఎస్​ ఆప్షన్​ను తొలగించడం గమనార్హం. ఒకవేళ, యూజర్లు ఎస్​ఎమ్​ఎస్​ చేయాలనుకుంటే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇదే తరహాలో జియో కూడా ఇటీవల తన ఎంట్రీ లెవల్​ రూ. 98 ప్లాన్​లో మార్పులు చేసింది. ఈ ప్లాన్​ కింద మొత్తం 14 రోజుల పాటు అన్​లిమిటెడ్​ కాలింగ్, 1.5GB డేటా మాత్రమే వస్తుంది. దీనిలో ఎటువంటి ఉచిత ఎస్​ఎమ్​ఎస్​లు లభించవు.

వొడాఫోన్​ ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రూ .49 వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్​ కింద 28 రోజుల పాటు 100 జీబీ డేటా, రూ .38 టాక్ టైమ్‌ మాత్రమే అందిస్తుంది. దీని కింద ఎటువంటి ఉచిత ఎస్​ఎమ్​ఎస్​లు లభించవు. కాగా, ప్రస్తుతం యూపీఐ ట్రాన్సాక్షన్స్​ పెరిగిపోవడంతో ఎస్​ఎమ్​ఎస్​ ద్వారా మొబైల్​ నంబర్​ ధ్రువీకరణ కూడా కీలకమైంది. దీంతో ఎస్​ఎమ్​ఎస్​ల కోసం వినియోగదారులు అధిక ధరతో కూడిన ప్లాన్లను ఎంచుకుంటారని టెలికాం సంస్థలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ వ్యూహంలో భాగంగానే ఎంట్రీ లెవల్​ ప్లాన్లలో ఎస్​ఎమ్ఎస్​లను తొలిగించాయి.

Post a Comment

0 Comments

Close Menu