Header Ads Widget

రూ.10వేల లోపు బడ్జెట్ ఫోన్స్

 

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. మరోసారి ప్రైమ్ డే సేల్ పేరుతో వచ్చేసింది. ఆఫర్ల వర్షం కురిపించనుంది. తన ప్రైమ్ మెంబర్స్ కోసం యానువల్ ప్రైమ్ డే సేల్ అనౌన్స్ చేసింది. జూలై 26 నుంచి ఈ సేల్ ప్రారంభం అవుతుంది. రెండు రోజుల పాటు ఈ సేల్ ఈవెంట్ ఉంటుంది. జూన్ 27 రాత్రి 11.59కి ముగుస్తుంది. స్మార్ట్ ఫోన్లు, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్, అమెజాన్ ఎకో డివైజస్ పై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. ఒకవేళ మీరు రూ.10వేల లోపు ఖరీదు చేసే కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు అమెజాన్ ప్రైమ్ డే సేల్ బెస్ట్ ఆప్షన్ అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఒప్పొ, షావోమి, శాంసంగ్ ఇతర కంపెనీల ఫోన్లు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు మరో ఆఫర్ కూడా ఉంది. హెచ్ డీఎఫ్ సీ కార్డు మీద 10శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ప్రైమ్ మెంబర్స్ కి ప్రత్యేక ఆఫర్లు కూడా ఉన్నాయి. సెలెక్టడ్ ఫోన్ల మీద 40శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. అంతేకాదు ఎక్స్ చేంజ్, నో కాస్ట్ ఈఎంఐ మరిన్ని ఆఫర్లు లభిస్తాయి.

Post a Comment

0 Comments