అంతరిక్షంలోకి 82ఏళ్ల ట్రైనీ వ్యోమగామి

 

అంతరిక్షంలోకి వెళ్లాలనేది ఆమె డ్రీమ్.. ఆరు దశాబ్దాల కల! ఎట్టకేలకు ఇప్పుడు సాధ్యమైంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సాయంతో అంతరిక్షంలోకి వెళ్లాలనే ఆశయాన్ని నెరవేర్చుకుంటోంది.. 82ఏళ్ల మహిళ ఆమే వాలీ ఫంక్ . ఆరు దశాబ్దాలుగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ఈమెకు జెఫ్ బెజోస్‌ ద్వారా అవకాశం దక్కింది. జెఫ్ బెజోస్‌తో కలిసి ఈ నెల చివర్లో బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళ్లనుంది.

వాలీ ఫంక్ ను మహిళ అనే కారణంతో అంతరిక్షంలోకి వెళ్తానంటే తిరస్కరించారు. ఇప్పుడు బెజోస్ సహా అతని సోదరుడితో కలిసి ఫంక్ అంతరిక్షానికి పయనం కానుంది. వెస్ట్ ఆరిజిన్ రాకెట్ వెస్ట్ టెక్సాస్ నుంచి అంతరిక్షానికి బయలుదేరనుంది. ఫంక్ 'గౌరవనీయ అతిథి'గా వ్యోమగామి సిబ్బందితో కలిసి వెళ్లనుంది. 1960లలో వ్యోమగామి శిక్షణ పొందిన మెర్క్యురీ 13 మంది మహిళలలో ఫంక్ ఒకరు. అప్పటి నుంచి అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఛాన్స్ రాలేదు. వారంతా మహిళలనే కారణంతో తిరస్కరించారు. అప్పటికి నాసా వ్యోమగాములంతా మిలటరీ టెస్ట్ పైలట్లుగా పురుషులే ఉండేవారు. వారికి మాత్రమే అంతరిక్షంలోకి వెళ్లేందుకు అవకాశం ఉండేది.

దశాబ్దాల తర్వాత 82 ఏళ్ల వయసులో ఫంక్ అంతరిక్షంలోకి వెళ్లేందుకు అవకాశం లభించింది. తద్వారా అంతరిక్షంలోకి వెళ్లనున్న పెద్ద వయస్సు (82) మహిళగా రికార్డు సృష్టించనుంది. 1998లో అంతరిక్ష నౌక డిస్కవరీలో 77 ఏళ్ల వయసులో జాన్ గ్లెన్‌ ఈ రికార్డు సృష్టించారు. ఇప్పుడా ఆ రికార్డును ఫంక్ బ్రేక్ చేయనుంది. ఈ సందర్భంగా బెజోస్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఫంక్ ను తమతో కలిసి అంతరిక్షానికి ఆహ్వానించారు.

'మీకు స్వాగతం.. ఇంతకాలం వేచి చూశారు. ఇదే సరైనఅంతరిక్షంలోకి 82ఏళ్ల ట్రైనీ  వ్యోమగామి సమయం.. అని బెజోస్ పోస్టు చేశారు. జూలై 20న మా గౌరవ అతిథిగా మీరు మాతో వస్తున్నందుకు సంతోషిస్తున్నాము' అని బెజోస్ తెలిపారు. గతంలో ఫంక్.. పైలట్, మాజీ ఫ్లయిట్ ఇన్స్ స్ట్రక్టర్ కూడా. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌లో మొదటి మహిళా ఇన్ స్ట్రక్టర్‌గా పనిచేశారు. అలాగే నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్‌లో మొదటి మహిళా భద్రతా పరిశోధకురాలుగా ఫంక్ పనిచేశారు.

Post a Comment

0 Comments