Ad Code

స్మార్ట్ ఫోన్ వాడకంలో రెండో స్థానం !

 


ఒకప్పుడు ఫోనంటే చాలా విలాస వంతమైన వస్తువుగా భావించే వారు. అయితే టెక్నాలజీలో వచ్చిన అనేక మార్పులు ఫోన్ను  నిత్యావసరం  చేసింది.  ప్రతి ఒక్కరి చేతిలో నేడు సెల్ ఫోన్లు కనిపిస్తున్నాయి.  బహుళ ప్రయోజనాలు కలిగిన సెల్ ఫోన్ సౌకర్యవంతంగా ఉండటమేకాక, మనిషి మనుగడకు ఇప్పుడది దిక్సూచిగా మారిపోయింది. భారత్ వంటి దేశాల్లో సెల్ ఫోన్ వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. కరోనా పరిస్ధితుల నేపధ్యంలో చిన్నారుల చదువుల నుండి పెద్దల ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల వరకు అన్నీ ఆన్ లైన్ కావటంతో సెల్ ఫోన్ పైనే ఎక్కువగా అధారపడాల్సి వస్తుంది. న్యూజ్ అనే సంస్ధ అంచనాల ప్రకారం భారతదేశంలో స్మార్ట్ ఫోన్లు వాడే వారి సంఖ్య 43.9 కోట్లకు చేరింది. 91 కోట్లకు పైగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులతో చైనా మొదటి స్ధానంలో ఉండగా, 44 కోట్లతో దాని తరువాత స్ధానంలో భారత్ ఉంది. మూడవస్ధానంలో అమెరికా ఉండగా ఆతరువాత స్ధానాల్లో ఇండోనేషియా, బ్రెజిల్, రష్యా, జపాన్, మెక్సికో దేశాలు ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu