Ad Code

మాస్కులు పని చేస్తాయా?

 

వైరస్ సైజ్ మాస్కులో ఉండే రంధ్రాలకంటే చిన్నదనీ కాబట్టి మాస్కు వాడటం వలన ఉపయోగంలేదని అనుకోకూడదు. వైరస్ చిన్నదే ఐనా వైరస్ ని వ్యాపింపజేసే డ్రాప్లెట్లు పెద్దవే. కాబట్టి మాస్కులు పని చేస్తాయి. మాస్కులు ఒకరో ఇద్దరో పెట్టుకోవడం వలన నిజానికి లాభం ఉండదు. అందరూ పెట్టుకున్నపుడే లాభం.  ఒక పాండెమిక్ సమయంలో ఎవరికి కరోనా ఉందో ఎవరికి లేదో ఇన్ఫెక్షన్ వచ్చిన వారం వరకు తెలిసే అవకాశం ఉండదు. ఈ సమయంలో ఇన్ఫెక్షన్ వచ్చిన వారు ఎక్కువ మందికి వ్యాపింప జేయగలరు.

ఇపుడు మీరు మాస్కు వేసుకుని ఉన్నా మీ పక్కన ఉన్న కరోనా పాజిటివ్ వ్యక్తి మాస్కు ధరించలేదు అనుకోండి అతడినుండి మీకు వచ్చే అవకాశం 50%. అతడు మాస్కు వేసుకుని మీరు మాస్కుతో లేరనుకోండి అతడినుండి మీకు వచ్చే అవకాశం 15% 

అదే ఇద్దరూ మాస్కు వేసుకున్నారనుకోండి అతడినుండి మీకు వ్యాపించే అవకాశం 1%. కాబట్టి మాస్కు అందరూ వేసుకుంటేనే వైరస్ వ్యాప్తి వేగంగా తగ్గుతుంది. ఒక  కరోనా పాజిటివ్ వ్యక్తి ఇద్దరికి కరోనాను వ్యాపింపజేశాడను కుందాం, ఆ ఇద్దరు మరో ఇద్దరికి ఆ నలుగురు మరో ఎనిమిది మందికి..ఇలా వ్యాపింపజేస్తూ పోతే కనుక..పది రౌండ్లయే కొద్దీ 512 మందికి పాకుతుంది. అదే ఇరవై రౌండ్లయ్యే సరికి 2,62,144 మందికి పాకుతుంది. అదే ఆ మొదటి వ్యక్తి మాస్కు వేసుకున్నాడు అనుకోండి.. అతడి నుంచి ఇంత మందికి పాకే అవకాశం లేదుగా?. సరే.. యాంటీ మాస్కుల వాళ్ళు చెబుతున్నదే కరెక్ట్ అనుకుందాం. మాస్కు వాడితే పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదనే అనుకుందాం. అపుడు ఒక వ్యక్తి ఇద్దరికి కాకుండా మాస్కులు వాడటం వలన పెద్దగా ఉపయోగం లేక, కేవలం 0.1 తక్కువగా 1.9 వ్యక్తులకు వ్యాపింపజేశాడే అనుకుందాం. అంటే మాస్కు వాడకుంటే ఇద్దరికి వచ్చే కరోనా మాస్కు వాడటం వలన 1.9 కు వచ్చింది అనుకుందాం.

అపుడు ఏమౌతుందో తెలుసా..

ఇరవై రౌండ్లయ్యే సరికి 2,62,144 మందికి కాకుండా.. 1,04,217 మందికి మాత్రమే వ్యాపింప జేయగలడు. అంటే తక్కువలో తక్కువ మాస్కుల వలన కేవలం 0.1 పాయింట్ మాత్రమే బెనెఫిట్ ఉందనుకున్నా పాపులేషన్ మొత్తంలో చూసుకుంటే వ్యాప్తి సగానికి పైగా తగ్గుతుంది.

కనుక మాస్కులు వాడండి. సరైన పద్దతిలో వాడండి.

మీ బంధు మిత్రులను వాడనీయండి.

సూడో సైన్సును నమ్మనవసరం లేదు.


Post a Comment

0 Comments

Close Menu