సోషల్ మీడియా ప్రజలను చంపేస్తోంది : జో బైడెన్

 

సోషల్ మీడియాలో కరోనా, వ్యాక్సినేషన్ పై అవనసర సమాచారం ప్రచారం అవుతోందని బైడెన్ అన్నారు. దీన్ని అరికట్టేందుకు వైట్ హౌస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందన్నారు. అసత్య ప్రచారంతో ప్రజల ప్రాణాలు బలి తీసుకోవద్దని బైడెన్ కోరారు. ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని బైడెన్ హెచ్చరించారు. వ్యాక్సిన్ వేసుకోని వారిలోనే వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటోందని గుర్తు చేసిన బైడెన్ సాధ్యమైనంత త్వరగా టీకాలు తీసుకోవడం మంచిదన్నారు. వ్యాక్సిన్లపై తప్పుడు సమాచారం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని యూఎస్ సర్జన్ జనరల్, భారతీయ అమెరికన్ డా. వివేక్ మూర్తి ఆందోళన వ్యక్తం చేసిన మరుసటి రోజే.. బైడెన్ ఇలా సోషల్ మీడియాపై విరుచుకుపడ్డారు. వ్యాక్సిన్లపై తప్పుడు సమాచారం ప్రచారం కావడంపై వివేక్ మూర్తి గురువారమే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ఆయన ‘ఇన్ఫోడెమిక్​’గా పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైరస్ తన కుటుంబానికి మిగిల్చిన విషాదాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. భారత్, యూఎస్‌లో కలిపి మొత్తం 10 మంది కుటుంబ సభ్యులను మహమ్మారి కారణంగా కోల్పోయినట్లు తెలిపారు. అందుకే కరోనాను తేలికగా తీసుకొవద్దని కోరారు. వ్యాక్సిన్ల పట్ల నిర్లక్ష్యం వహించరాదని, వీలైనంత త్వరగా అందరూ టీకాలు తీసుకోవాలని సూచించారు. కేవలం టీకాల కారణంగా కరోనా అదుపులోకి వచ్చిందని అన్నారు. సోషల్ మీడియా వేదికగా వ్యాక్సిన్లపై అసత్య ప్రచారం జరగడాన్ని ఉపేక్షించబోమన్నారు. వెంటనే సోషల్ మీడియా సంస్థలు తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. లేనిపక్షంలో తామే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ వ్యవహారంపై ఫేస్​బుక్ స్పందించింది. బైడెన్ వ్యాఖ్యలను ఖండించింది. సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. ప్రజలను రక్షించే ఉద్దేశంతోనే సమాచారం అందుబాటులో ఉంచుతున్నామంది. నిజానికి ఫేస్​బుక్​లో కోవిడ్-19 వ్యాక్సిన్లపై కచ్చితమైన సమాచారాన్ని 200 కోట్ల మంది చూశారంది. వ్యాక్సిన్ ఎక్కడ లభిస్తుందనే వివరాలను తెలిపే ‘వ్యాక్సిన్ ఫైండర్ టూల్​’ను 33 లక్షల మంది అమెరికన్లు ఉపయోగించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ప్రాణాలను కాపాడటంలో ఫేస్​బుక్ ఎంతగానో సహాయపడుతోందని చెప్పడానికి ఈ గణాంకాలే సాక్ష్యమని వివరణ ఇచ్చింది. 

Post a Comment

0 Comments