తలనొప్పిని తగ్గించే హెడ్ సెట్న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు తలనొప్పితో బాధపడుతున్న వారికోసం సరికొత్త టెక్నాలజీ తోకూడిన హెడ్ సెట్ ను రూపొందించనున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది నొప్పి నివారణకు దోహదపడే పెయిన్ కిల్లర్ హెడ్ సెట్ అన్నమాట. ఎలక్ట్రో ఎన్స్ఫలోగ్రామ్ టెక్నాలజీ తో దీని తయారు చేయనున్నారు. మనిషి మెదడులోని తరంగాలను రీడ్ చేసే పరిజ్షానాన్ని ఈ హెడ్ సెట్ కలిగి ఉంటుంది. దీనిని ధరించటం ద్వారా తలనొప్పి వచ్చే సమయంలో ఆనొప్పిని ఎదుర్కోనేందుకు వీలుగా మెదడును ముందుగానే అప్రమత్తం చేస్తుంది. తద్వారా నొప్పి నివారణ సాధ్యమౌతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ హెడ్ సెట్ తో న్యూరో ఫీడ్ బ్యాక్ థెరపీ చేయవచ్చు. మెదడులోని నరాల పనీతీరును మెరుగుపర్చి నొప్పిని తగ్గిస్తుంది. నిద్రపట్టక, నిత్యం టెక్షన్ తో గడిపేవారికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. హెడ్ సెట్ లో ఉండే ఎలక్ట్రోడ్లు మెదడులోని విద్యుత్ తరంగ దైర్ఘాలను పరిశీలించటంతోపాటు, నరాలపనితీరును ఎప్పటికప్పుడు నమోదు చేస్తుంటాయి. తలనొప్పితో బాధపడేవారు రెండు నెలలపాటు క్రమం తప్పకుండా ధరిస్తే తీవ్రమైన తలనొప్పి సమస్యలు సైతం తొలగించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం పరిశోధనలు చివరి దశలో ఉండగా, వచ్చే ఏడాది ఈ హెడ్ సెట్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.

Post a Comment

0 Comments