Header Ads Widget

అమెజాన్ మెగా ఆఫర్


ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్ తన వినియోగదారులకు మెగా హోమ్ మాన్‌సూన్ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌ జూలై 8 నుంచి జూలై 11 వరకు కొనసాగనుంది. గృహోపకరణాలు, కిచెన్‌ ఉపకరణాలతో సహా వివిధ ఉత్పత్తుల కొనుగోలుపై 70 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. శాంసంగ్‌, ఎల్జీ, వర్ల్పూల్ వంటి సంస్థల వాషింగ్ మెషీన్లపై సుమారు 30శాతం డిస్కౌంట్‌ను ఇవ్వనుంది. ఎల్‌జీ, శామ్‌సంగ్, వర్ల్‌పూల్, హైయర్, గోద్రేజ్ వంటి సంస్థల రిఫ్రిజిరేటర్ల కొనుగోలుపై అమెజాన్ ఇండియా 35శాతం తగ్గింపును అందిస్తోంది. గీజర్ల కొనుగోలుపై 35 శాతం వరకు, వాటర్‌ ప్యూరిఫైయర్లపై 45 శాతం వరకు ,బేసిక్‌ ఎయిర్ కండీషనర్ల కొనుగోలుపై 60శాతం వరకు మినహాయింపును ఇస్తోంది.ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన కొనుగోళ్లకు పది శాతం, రూ. 1,250 వరకు తక్షణ తగ్గింపును అందిస్తోంది. క్రెడిట్ కార్డుతో ఈఎంఐలో భాగంగా, కనీసం ఐదు వేల రూపాయల విలువ గల వస్తువుల కొనుగోలుపై సుమారు 10శాతం తక్షణ డిస్కౌంట్‌ను అందిస్తోంది.

Post a Comment

0 Comments