అప్ డేట్ చేసుకోండి

విండోస్ 10 తో పాటు, విండోస్ 7 లో కూడా ఆపరేటింగ్ సిస్టమ్‌లో లోపం ఉన్నట్టు మైక్రోసాఫ్ట్ సంస్థ పేర్కొన్నది. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో బయటపడిన తీవ్రమైన లోపాన్ని హ్యాకర్లు ఉపయోగించుకొని డేటాను చోరీ చేసే అవకాశం ఉందని, విండోస్ అప్ డేట్ చేసుకోకపోతే హ్యాకర్లు డేటా చోరీకి పాల్పడేందుకు అవకాశమిచ్చినట్లవుతుందని అందుకనే  వినియోగదారులు వెంటనే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ కోరింది.  ఆపరేటింగ్ సిస్టమ్‌లో తీవ్ర లోపం బయటపడటంతో సంస్థ వినియోగదారులను అప్రమత్తం చేసింది.  సాధారణంగా ఒకే ప్రింటర్‌ను ఎక్కువ మంది ఉపయోగించుకునేందుకు విండోస్‌లో 'ప్రింట్‌ స్పూలర్‌' ఉపయోగపడుతుంది. అయితే, ఇందులో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్టు గుర్తించామని, ఈ లోపాన్ని అధిగమించేందుకు తప్పనిసరిగా ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేసుకోవాలని  సంస్థ తెలిపింది. 

Post a Comment

0 Comments