Header Ads Widget

రియల్‌మీ : ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌


రియల్‌మీ సీ3 స్మార్ట్ ఫోన్‌కు ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ను అందిస్తున్నారు. దీనికి సంబంధించిన బీటా వెర్షన్ జులైలోనే అందించారు. ఇప్పుడు స్టేబుల్ వెర్షన్ కూడా అందిస్తున్నారు. ముందుగా బీటా ఇన్‌స్టాల్ చేసుకున్నవారికి ఈ స్టేబుల్ అప్‌డేట్‌ను అందిస్తున్నారు. దీని బిల్డ్ నంబర్ RMX2027_11_C.04 వెర్షన్‌గా ఉంది. అలాగే ఈ అప్‌డేట్ సైజ్ 168 ఎంబీ మాత్రమే ఉంది. ఈ అప్‌డేట్ ద్వారా ఫోన్ పెర్ఫార్మెన్స్‌ను మెరుగుపరచనున్నారు. ఐకూ 8 ఫీచర్లు టీజ్ చేసిన కంపెనీ.. స్నాప్‌డ్రాగన్ 888 కంటే పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో! రియల్‌మీ సీ3 స్పెసిఫికేషన్లు రియల్ మీ సీ3 స్మార్ట్ ఫోన్‌లో 6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. స్క్రీన్ టు బాడీ రేషియో 89.8 శాతంగా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ను ఇందులో అందించారు. మీడియాటెక్ హీలియో జీ70 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్ మీ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో వెనకవైపు రెండు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగా పిక్సెల్ కాగా, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో కెమెరాను కూడా వెనకవైపు అందించారు.

Post a Comment

0 Comments