Ad Code

ఓలా ఈ-స్కూటర్ వచ్చేసింది !


ఓలా ఈ-స్కూటర్ ఎస్-1, ఎస్-1ప్రో అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. రివర్స్ మోడ్ లో వస్తున్న కొన్ని ద్విచక్రవాహనాల్లో ఇదొకటి. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 181 కిమీ వరకూ ప్రయాణించొచ్చు. గరిష్టంగా 115 కిమీ వేగం అందుకోగలదు. 3 సెకన్లలో 40 కిమీ, 5 సెకన్లలో 60 కిమీ వేగం అందుకోగలదు. ఎస్1 ప్రారంభ ధర రూ.99వేల 999. ఎస్1 ప్రో ధర రూ.1,29,999. ఫేమ్ రాయితీ కింద ఈ ధర మరింత తగ్గనుంది. 10 రంగుల్ఉన్నాయి.  ఎస్1 ప్రో లో 3.97kWh బ్యాటరీ కెపాసిటీ. ప్రొపరైటరీ బ్యాటరీ మేనేజ్ మెంట్ సిస్టమ్ కలిగి ఉంది. బ్యాటరీని నిత్యం మానిటర్ చేస్తూ ఉంటుంది. బ్యాటరీ డ్యూరబులిటీ, పెర్ఫార్మన్స్, రేంజ్, భద్రతను మానిటర్ చేస్తుంది. దీనికి ఎలాంటి కీ ఉండదు. స్మార్ట్ ఫోన్ తో ఆన్ అవుతుంది. డిజిటల్ కీ ఫీచర్ కలిగుంది. బండిని పార్క్ చేసి మనం కాస్త దూరం వెళితే చాలు.. ఆటోమేటిక్ గా అదే లాక్ అవుతుంది. మల్టి మైక్రోఫోన్ అర్రే, 7 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే ఉంది. 

Post a Comment

0 Comments

Close Menu