Ad Code

నల్లమల అందాలు !

 

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా, గిద్దలూరు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతం ఎంతో సుందరంగా దర్శనమిస్తుంది. కర్నూలు ప్రకాశం జిల్లాకు సరిహద్దు అయిన ఈ ప్రాంతం ఎత్తైన కొండలు దట్టమైన అడవి విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతంలో నుంచి ప్రయాణించే ప్రయాణికులు ఈ అడవి అందాలను చూసి ఆస్వాదిస్తూ ఉంటారు.

ఈ నల్లమల అటవీ ప్రాంతంలో ఎంతో విలువైన కలపకు బాండాగారం ఈ అటవీ ప్రాంతం పై ఆధారపడి ఎన్నో తెగలు, జాతుల ప్రజలు జీవనం సాగిస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో వన్యప్రాణులు కూడా అధికంగానే సంచరిస్తూ ఉంటాయి. ఇక ఈ ప్రాంతంలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన రైల్వే వంతెన ఉంది.  అది ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది బస్సు రైలులో ప్రయాణించే వాళ్ళు బ్రిడ్జి ని చూసి ఆశ్చర్యానికి లోనవుతుంటారు. ఎందుకంటే అంత ఎత్తులో ఆ కాలంలో ట్రైన్ ఎలా ప్రయాణించి ఉంటారో అని ఊహించుకుని ఆశ్చర్య పోతుంటారు. 

దశాబ్దాల క్రితం కొండలో నిర్మించిన రైల్వే సొరంగం రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులను వేరే వింత లోకం లోకి తీసుకు వెళుతుంది. ఈ ప్రాంతంలో ప్రవహించే సగిలేరు వాగుకు ఉన్న ప్రత్యేకత, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వాగు ప్రవహిస్తున్న సమయంలో సందర్శకులు వాగులు జలకాలాడుతూ సేదతీరుతూ ఉంటారు. దాదాపు 30 నుండి 50 కిలోమీటర్ల వరకు విస్తరించిన ఈ నల్లమల అటవీ ప్రాంతంలో ఎన్నో వన్యప్రాణులు తోపాటు క్రూర మృగాలు కూడా సంచరిస్తూ ఉంటాయి. దీనికి అనుసంధానంగా రాచర్ల మండలంలోని నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం వద్ద ఉన్న నీటి గుండం అందరినీ ఆకర్షిస్తుంది. ఎంత లోతు ఉందో ఇప్పటికి తెలియకపోవడమే ఈ గుండం ప్రత్యేకత. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఈ గుండంలోకి అధిక మొత్తంలో వరద నీరు పోటెత్తుతుంది ఆ సందర్భంలో ఉగ్రరూపంలో ఉన్న ఈ గుండాన్ని చూస్తే గుండంలోకి దిగి స్నానం ఆచరించేందుకు ఎవరూ సాహసించరు.

ఇలా గిద్దలూరు నల్లమల అటవీ ప్రాంతంలో ఎన్నో ప్రత్యేకతల కు పెట్టింది పేరు అలానే ప్రకాశం కర్నూలు సమీపంలో ఉన్న నరసింహ స్వామి దేవాలయం వద్ద వజ్రాలు కూడా దొరుకుతాయని ఇక్కడ చాలామంది ప్రజలు వర్షాలు పడిన సమయంలో వజ్రాల కోసం వేట సాగిస్తారు.  గిద్దలూరు నల్లమల అటవీ ప్రాంతాన్ని స్థానిక ప్రజలు చూసి ఎంతో గర్వంగా ఫీల్ అవటమే కాకుండా ఇంత అదృష్టం అవకాశం కల్పించిన పుడమి తల్లికి రుణపడి ఉంటామని మనసులో ప్రకృతి తల్లికి నమస్కరిస్తూ ఉంటారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు మాత్రం ఈ ప్రకృతిని చూసి పరవశించి పోతుంటారు

Post a Comment

0 Comments

Close Menu