Header Ads Widget

వర్షాకాలం - ఫ్రిజ్​లో పెట్టకూడనవి...!

 


టెక్నాలజీ పెరిగిపోవడంతో ఫ్రిజ్​ల వాడకం ఎక్కువైపోయింది. ప్రతీ ఊరిలోనూ ఫ్రిజ్​లు ఉన్నాయి. కూరగాయలు, పండ్లే కాదు..రవ్వ, చింతపండు, పచ్చళ్లు .. ఒక్కటేమిటి సర్వం దానిలో దూరిపోతున్నాయి. దీనితో ఫ్రీజ్ చెత్తకుండిలా తయారైంది. అయితే చాలామంది కాయగూరలు, పండ్లను ముందే కట్‌ చేసుకొని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటుంటారు. కానీ వర్షాకాలంలో ఈ అలవాటు మానుకోమంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ కాలంలో గాలిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లు కట్‌ చేసిన ఆహారం పైకి చేరతాయి. మనం వాటిని మళ్లీ కడగకుండా తినేయడం వల్ల అవి మన కడుపులోకి చేరి లేనిపోని అనారోగ్యాలకు కారణమవుతాయి. ముందుగా ఆయా కాయగూరలు, పండ్లను ఉప్పు నీటిలో కాసేపు నానబెట్టడం, ఎప్పటికప్పుడే తాజాగా వాటిని కట్‌ చేసుకోవడం ఉత్తమం. వండుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఉదయం వండినవి రాత్రి, రాత్రి మిగిలిపోయినవి మరునాడు ఉదయం తినడం అస్సలు మంచిది కాదు. ఏ పూటకాపూటే వేడివేడిగా వండుకొని తినాలి. రిఫ్రిజిరేటర్ లో పెట్టడం వల్ల కూరగాయలు పండ్లలో ఉన్న సహజ లక్షణాలు కోల్పోయే ప్రమాదం  ఉందంటూ నిపుణులు  హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పుచ్చకాయ వంటి పండ్లను అయితే ఫ్రిజ్లో అస్సలు పెట్టకూడదంట. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలామంది పుచ్చకాయ తినడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే పుచ్చకాయ తినడం మంచిదే  కానీ రిఫ్రిజరేటర్​లో  నిల్వ ఉంచిన పుచ్చకాయ తినడం మాత్రం అస్సలు మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు ఉల్లిపాయలు కూడా ఫ్రిజ్​లో పెట్టకూడదంటా. ఎందుకంటే అలా పెడితే దాని సహజత్వం పోతుందట. ఇక అరటి పండ్లు సైతం ఫ్రిజ్​లో పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల దాహం వేయదు. అలాగని నీళ్లు తాగకపోతే.. డీహైడ్రేషన్‌, ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది. కాబట్టి ఈ కాలంలోనూ మీ బరువును బట్టి సరైన మోతాదులో నీళ్లు తాగాలి. అవి కూడా మరిగించి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవడం మంచిది. ఈ చిట్కా వల్ల ప్రస్తుతం పొంచి ఉన్న కరోనా ముప్పు నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు.. అలాగే బరువూ తగ్గచ్చు. బంగాళాదుంపలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి ఫ్లేవర్‌ను కోల్పోతాయి. పైగా.. ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం వల్ల ఈ దుంపల్లోని స్టార్చ్ (పిండిపదార్థం) చక్కెరగా మారిపోయే అవకాశం ఉంది. అందువల్ల పేపర్ బ్యాగుల్ ప్యాక్ చేసి గది టెంపరేచర్‌లోనే నిల్వ ఉంచాలి. టొమాటోలు ఒక్కసారి ఫ్రిజ్‌లో ఉంచిన పూర్తిగా రుచిని కోల్పోతాయి. అందువల్ల వీటిని ఉష్ణోగ్రతలోనే నిల్వచేయాలి. ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంది. ఆలివ్ ఆయిల్‌ను శీతలీకరణ యంత్రంలో నిల్వ చేయడం వల్ల దాన్ని స్థిరత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఆలివ్ నూనె ఒక చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. ఫ్రిజ్‌లో కాంతి, వేడి, గాలిలేని ప్రదేశంలో నిల్వ చేయడం వల్ల హానికారక క్రిములు తయారై ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments