Ad Code

షియోమి నుంచి టీవీ



ప్రముఖ బ్రాండ్ అటునవంటి షియోమి అటు స్మార్ట్ మొబైల్స్ లోనూ, ఇటు స్మార్ట్ టీవీ ల పైన కూడా బాగా ఆకట్టుకుంటోంది ప్రేక్షకులను. వరుసగా స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తూ సంచలనాలు సృష్టించింది షియోమి.ఇక అంతే కాకుండా ప్రస్తుతం టీవీల పైన కూడా దృష్టి పెట్టుకొని, తాజాగా ఒక టీవీ ని అతి తక్కువ ధరకే అందించనుంది మన ముందుకు.


షియోమి తాజాగా 32 ఇంచుల ఒక LED టీవీని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది హెచ్డీ సపోర్ట్ తో పాటు ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ గా కూడా పనిచేస్తుంది. ఈ టీవీ కి మరికొన్ని అద్భుతమైన ఫీచర్లతో విడుదల చేశారట.. వాటి గురించి చూద్దాం.

MI LED tv 4C:
ఈ టీవీ ని తాజాగా విడుదల చేయడంతో పాటు 15,999 రూపాయలకే మనకు అందించనుంది. అంతేకాకుండా hdfc బ్యాంక్ కస్టమర్లకు ఈ స్మార్ట్ టీవీ పై 1000 రూపాయల వరకు తగ్గింపు ధరను అందించింది. ఇక ఈ టీవీ 32 అంగుళాలు కలదు. ఇక ఈ టీవీ చుట్టూ ఉండేటువంటి ప్యానల్ 60HZ. ఇక ఇది 117 డిగ్రీల యాంగిల్ లో పిక్చర్ ను చూపించగలదు.

పిక్చర్ క్లారిటీ కోసం ఇందులో వివిధ పిక్చర్ ను అమర్చడం జరిగింది. ఇక ఇందులో ప్రాసెస్ విషయానికొస్తే, A53 యాడ్ కోర్ ప్రాసెసర్ తో కలదు. ఇక ఇందులో 1GB ram తో పాటు,8GB మెమొరీ సామర్థ్యం కలదు. ఈ టీవీ ఆండ్రాయిడ్ ఆధారితంగా పనిచేస్తుంది. ఇక ఇందులోనూ ఒక స్పెషల్ ఫీచర్స్ సహాయంతో 5 సెకండ్లలో టీవీని ఆన్ చేసుకోవచ్చు.

ఇక కనెక్టింగ్ విషయానికి వస్తే..4.2 వైఫై సపోర్ట్ చేస్తుంది. ఇక ఇందులో కూడా 3 HDMI పోర్ట్స్ కలదు. ఇక రెండు యూఎస్బీ సపోర్టు కూడా కలదు.3.5 MM జాక్ ఆడియో సాంగ్స్ తో సపోర్ట్ చేస్తుంది. ఇక గూగుల్ అసిస్టెంట్ తో కూడా సపోర్ట్ చేయగలదు. ఇక ఇందులో రెండు 10 W అద్భుతమైన స్పీకర్లను కలిగి ఉంటుంది. ఇక ఇందులో కొన్ని ప్రముఖ టీవీ ఛానల్స్ డీఫాల్ట్ గా అమర్చబడి ఉంటాయి.

Post a Comment

0 Comments

Close Menu