Ad Code

కొత్త లోగో లాంచ్ చేయనున్న మహీంద్రా

 

 

మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ కొత్త విజువల్ ఐడెంటిటీ కోసం ప్రయత్నిస్తుంది. ఈ మేరకు బ్రాండ్ న్యూ లోగోను విడుదల చేసింది. మరి కొద్ది రోజుల్లో లాంచ్ చేయనున్న XUV700తో ఈ లోగో లాంటి సింబల్ తో కార్ లాంచ్ అవనుంది. 2022 నాటికి 823పట్టణాల్లో 1300మంది చేతికి అందనుంది XUV 700. కొత్త లోగోను లాంచ్ చేస్తున్నట్లు మహీంద్ర ఆటోమేటివ్ డివిజన్ సీఈవో వీజయ్ నక్రా వెల్లడించారు. ప్రస్తుతం వాడుతున్న లోగోను 2000వ సంవత్సరంలో లాంచ్ చేశారు. ఆనంద్ మహీంద్రా మేనేజింగ్ డైరక్టర్ అయిన రెండేళ్లకు దీనిని రిలీజ్ చేశారు. ప్రస్తుత లోగోను తొలిసారి 2002లో స్కార్పియోపై వాడారు. న్యూ జనరేషన్‌ XUV700 ఈసంవత్సరమే రిలీజ్ కానుంది. సరికొత్త డబ్ల్యూ 601 ప్లాట్‌ఫామ్ బేస్ చేసుకొని ఈ సరికొత్త వెహికల్‌ను మహీంద్ర తయారు చేసింది. రెండు ఇంజిన్ ఆప్షన్స్‌తో రిలీజ్ కానుండా.. ఒకటి 2.0 లీటర్ పెట్రోల్ మోటర్, 2.2 లీటర్ డీజిల్ యూనిట్. స్మార్ట్ ఫిల్టర్ టెక్నాలజీ, అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌, క్లైమెట్ కంట్రోల్‌, వైర్‌లెస్ చార్జింగ్, ట్విన్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, డ్రైవర్ అటెన్షన్ డిటెక్షన్ లాంటి సరికొత్త ఫీచర్లు కారులో ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu