Ad Code

చైనా లో వారానికి మూడు గంటలే ఆన్‌లైన్ గేమింగ్‌ !


ఈ జనరేషన్ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు ఎలా ఆడిక్ట్ అవుతున్నారో అందరికీ తెలుసు. దీనికి తోడు కరోనా ఒకటి. కరోనా వల్ల.. స్కూళ్లను మూసివేయడంతో.. పిల్లలు ఆన్‌లైన్ క్లాసుల బాట పట్టారు. దీంతో ఖచ్చితంగా తల్లిదండ్రులే పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆన్‌లైన్ క్లాసుల పేరుతో పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ డౌన్‌లోడ్ చేసుకొని క్లాసులు వినకుండా.. గేమ్స్ ఆడుతూ కూర్చుంటున్నారు. క్లాసులు అయిపోయాక కూడా స్మార్ట్‌ఫోన్‌ను వదలడం లేదు. ఇది ఎక్కడో ఒక్క చోట జరుగుతుంది అనుకుంటే పొరపాటే. ప్రపంచమంతా అలాగే ఉంది. అందుకే  చైనాలో పిల్లల ఆన్‌లైన్ గేమింగ్‌పై కొత్త రూల్స్ తీసుకొచ్చింది. పిల్లలు ఆన్‌లైన్ గేమింగ్‌కు అడిక్ట్  కాకుండా ఉండేందుకు భవిష్యత్తు తరాన్ని కాపాడుకునేందుకు చైనా ప్రభుత్వం నడుం బిగించింది.18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్లందరూ ఆన్‌లైన్ గేమ్‌కు రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ల ఐడీ కార్డును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఐడీ కార్డు ఆధారంగా వాళ్ల వయసును ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు నిర్ధారించి.. కేవలం వారానికి మూడు గంటలు మాత్రమే వాళ్లకు ఆన్‌లైన్ గేమ్ ఆడుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అది కూడా ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం.. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు మూడు రోజులు రోజుకో గంట చొప్పున మూడు గంటలు మాత్రమే ఆన్‌లైన్ గేమింగ్‌కి అవకాశం కల్పించనున్నారు. ఒకవేళ మిగతా రోజుల్లో స్కూళ్లకు సెలవులు ఉంటే మాత్రం.. రోజుకు మరో గంట ఎక్కువసేపు ఆడుకునేలా అవకాశం ఇస్తారు. ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు కూడా ప్రభుత్వం.. పిల్లల గేమింగ్ పర్మిషన్ టైమ్‌కు సంబంధించిన రూల్స్‌ను పంపించి.. ఆ టైమ్ ప్రకారమే.. పిల్లలకు పర్మిషన్ ఇవ్వాలని ఆదేశాలు ఇస్తోంది. ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లకు చైనా పెట్టింది పేరు. కుప్పలు కుప్పలుగా ఆన్‌లైన్ గేమ్స్ చైనా నుంచే డెవలప్ అవుతుంటాయి. అందుకే.. అక్కడి పిల్లలు, యువత.. ఆన్‌లైన్ గేమింగ్‌కు బాగా అడిక్ట్ అయిపోతున్నారు. 2019 లో కూడా లేట్ నైట్ ఆన్‌లైన్ గేమింగ్‌ను చైనా ప్రభుత్వం బ్యాన్ చేసింది. అర్ధరాత్రి దాటాక.. కేవలం 90 నిమిషాల పాటు మాత్రమే ఆన్‌లైన్ గేమింగ్‌కు అవకాశం ఇచ్చింది. వీకెండ్‌లో మాత్రం 3 గంటలు ఆడుకునే చాన్స్ ఇచ్చింది. తాజాగా ఈ సరికొత్త రూల్స్‌ను చైనా తీసుకొచ్చింది.

Post a Comment

0 Comments

Close Menu