Ad Code

గూగుల్‌కి ఏం తెలుసో తెలుసుకోండి..!

 

మీ గురించి గూగుల్ వద్ద ఉన్న సమాచారాన్ని పొందడం చాలా సులభం. Takeout.google.com అనే వెబ్‌సైట్‌కు వెళ్లండి. అందులో ఆల్ డేటా క్యాటగిరి ఎక్స్‌పోర్ట్‌ను ఎంచుకోండి. అనతరం ఏ విధంగా సమాచారం పొందలనుకుంటున్నారు అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఈ మెయిల్ ద్వారానా లేక గూగుల్ డ్రైవ్ ద్వారానా అనే వివరాలు ఇవ్వాలి. వెంటనే మీ గురించి గూగుల్ వద్ద ఉన్న సమాచారం మీ వద్దకే వస్తుంది.

పంపిన మెయిల్‌ను రద్దు చేయడం ఎలా... : మనం చాలా ముఖ్యమైన మెయిల్‌ను పంపుతాం.. ఒక్కో సారి సెండ్ చేసిన తర్వాత వెంటనే ఒక్క చిన్న మార్పు చేస్తే బాగుండని గుర్తు వస్తుంది. కానీ ఏం చెయ్యలేం.. సెండ్ చేశాంగా అనుకుంటాం. కానీ జీమెయిల్‌లో పంపిన మెయిల్‌ను ఆపే అవకాశం ఉంది.. అది ఎలాగో చూడండి. ముందుగా మీరు మెయిల్ ఓపెన్ చేశాక కుడివైపు పైన సెట్టింగ్‌లోకి వెళ్లండి. అందులోని  ఆల్ సెట్టింగ్ లోకి వెళ్లండి. అందులో జనరల్ సెట్టింగ్‌లో అన్‌సెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో గరిష్టంగా 30 సెకన్లు పెట్టుకోవచ్చు. అది ఎంచుకొంటే మీరు పంపిన మెయిల్‌ను 30 సెకన్లలోపు అన్‌సెండ్ చేయొచ్చు. 

ఆఫ్‌లైన్ గూగుల్ యాప్‌ల వినియోగం : చాలా గూగుల్ యాప్‌లు ఆన్‌లైన్‌లో పని చేస్తాయి. వాటిని ఆఫ్‌లైన్‌లో కూడా వినియోగించుకోవచ్చు గూగుల్ యాప్‌లను ఆఫ్‌లైన్‌లో వినియోగించుకునేందుకు కొన్ని సెట్టింగులు మార్చుకొంటే చాలు. ముందుగా మీరు ఆఫ్‌లైన్‌లో వినియోగించుకోవాలనుకొన్న గూగుల్ యాప్‌ను బ్రౌజర్‌లో తెరవండి అందులో Drive.google.com/driveను తెరిచి సైన్ అవ్వండి. అనంతరం కుడివైపు పైన ఉన్న గేర్ చిహ్నాన్ని క్లిక్ చేసి సెట్టింగ్‌లోకి వెళ్లండి. అక్కడ ఆఫ్‌లైన్ విభాగంలో మీరు వినియోగించుకోగల గూగుల్ యాప్‌కు సంబంధించి ఆఫ్‌లైన్‌లో పని చేయడం అనే ఆప్షన్ చెక్ బాక్స్ ఉంటుంది. దాన్ని టిక్ చేయండి. ఏవైన ఫైల్‌లను ఉపయోగించడానికి గూగుల్ డిస్క్‌లను ఉపయోగించండి. ఆ ఫైల్‌లను ఆఫ్‌లైన్‌లో కూడా వినియోగించవచ్చు. మీరు ఆఫ్‌లైన్‌లో ఏమైన మార్పులు చేస్తే తిరిగి ఆన్‌లైన్‌లోకి వెళ్లిన వెంటనే మార్పులు పూర్తవుతాయి.

Post a Comment

0 Comments

Close Menu