Ad Code

సింగిల్ సీట్ ఈ-స్కూటర్


గతంలో ఇండియా రోడ్లపై ఎలక్ట్రిక్ స్కూటర్ వెళ్తే... అంతా దాన్ని ఆశ్చర్యంగా చూసిన రోజులు. ఇప్పుడలా కాదు... ఎలక్ట్రిక్ వెహికిల్స్ జోరు పెరుగుతోంది. ఎతెర్ స్టార్టప్ కంపెనీ 450X స్కూటర్లు, ఓలా ఎలక్ట్రిక్... రెండు మోడల్స్ S1, S1 ప్రోను ఆగస్ట్ 15న రిలీజ్ చెయ్యడంతో.. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారుచేస్తున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా కూడా చైనాలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. అవి U-GO, సింగిల్ సీట్ U-BE. చైనాలోని హోండా డివిజన్ వుయాంగ్ హోండా వీటిని తెచ్చింది. ఈ కంపెనీ హోండాలో భాగమే. ఈ రెండు స్కూటర్లలో  ఒక దానికి బ్యాక్ సీటు లేదు. సింగిల్ సీటే ఉంది. అలా ఎందుకు చేశారంటే... ఎక్కువ మైలేజ్ ఇస్తుందని. అందువల్లే యూబీ ప్రత్యేక స్కూటర్‌గా నిలుస్తోంది. ఈ స్కూటర్లకు ముందువైపున ఎక్కువ ప్లేస్ ఉంది. అందువల్ల అక్కడ లగేజీ పెట్టుకోవడానికి వీలవుతుంది. ఇక వీటికి స్టైలిష్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది. యాంటీ థెఫ్ట్ కీ లాక్ ఉంది. USB పోర్ట్ కూడా ఉంది. ఈ స్కూటర్లకు 3 రకాల బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. బైక్ ఎంత దూరం వెళ్లాలి అన్నదాన్ని బట్టీ... కావాల్సిన బ్యాటరీ ప్యాక్ సెట్ చేసుకోవచ్చు. అవి 50కి.మీ., 70కి.మీ., 85కి.మీ. మైలేజ్ ఇచ్చే బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. ఈ బైక్ప్ బరువు 54 కేజీలు మాత్రమే. ఈ బైక్స్ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలవు. అందువల్ల వీటిని నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్, వెహికిల్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. పట్టణ, నగరాల్లో ఉండేవారికి వీలుగా ఈ బైక్‌ని రూపొందించింది కంపెనీ. ఈ యూబీ స్కూటీని ఇండియాలో లాంచ్ చేస్తారా లేదా అనేది హోండా కంపెనీ ఇంకా చెప్పలేదు. ఇండియాలో ఈ బైక్ ధర రూ.91,000 ఉండొచ్చు. యూగో (U-Go) బైక్‌కి మాత్రం వెనక కూడా సీట్ ఉంటుంది. ఈ స్కూటర్ ఒకసారి ఛార్జ్ చేస్తే.. 133కి.మీ. వరకూ వెళ్తుంది.

Post a Comment

0 Comments

Close Menu