Ad Code

శ్రీకృష్ణుడంటే ఎన్టీఆరే !

 


ఎన్‌టీఆర్‌కు నటుడిగా బాగా పేరు తెచ్చి పెట్టినవి మాత్రం పౌరాణిక చిత్రాలే. ముఖ్యంగా ఆయన నటించిన పలు పౌరాణిక చిత్రాల్లో శ్రీకృష్ణుడి వేషంలో ఆయన ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. విశ్వవిఖ్యాత నటనా సార్వభౌమ, స్వర్గీయ, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్ నటనా కౌశలం గురించి ఎవరికీ పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తెరపై కనిపించాడంటే చాలు అభిమానులకు పండగే. ఆయన కన్నుమూసి చాలా కాలం అవుతున్నా ఇప్పటికీ ఆయన సినిమాలను తెగ చూసేవారున్నారని చెబితే అతిశయోక్తి కాదు. అయితే ఎన్‌టీఆర్‌కు నటుడిగా బాగా పేరు తెచ్చి పెట్టినవి మాత్రం పౌరాణిక చిత్రాలే. ముఖ్యంగా ఆయన నటించిన పలు పౌరాణిక చిత్రాల్లో శ్రీకృష్ణుడి వేషంలో ఆయన ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. అభిమానుల ప్రశంసలు చూరగొన్నారు. హిందూ దేవుళ్లు నిజంగా మనకు కనిపిస్తే ఎలా ఉంటారో తెలియదు. కానీ ఎన్టీఆర్‌ను ఆ పాత్రల్లో తెరపై చూశాక నిజంగా దేవుడు అచ్చం అలాగే ఉంటాడనుకునేవారు. ముఖ్యంగా శ్రీకృష్ణుడి పాత్రలో ఎన్‌టీఆర్ ఒదిగిపోయారు. ఆ పాత్రకు ఆయన జీవం పోశారు. సినిమాల్లో కృష్ణుడి పాత్ర గురించి చెబితే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది ఎన్‌టీఆరే. అంతగా ఆయన ఆ పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశారు. తెరపై కృష్ణుడి గెటప్‌లో ఎన్‌టీఆర్ కనిపిస్తే చాలు.. ఇంక ఆ సినిమాకు తిరుగుండదని అప్పట్లో నిర్మాతలు భావించేవారు. అందుకనే ఆయనతో చాలా మంది ఆ పాత్రలతో సినిమాలు తీశారు. ఎన్‌టీఆర్ శ్రీకృష్ణుడి పాత్రలో అనేక సినిమాల్లో నటించినా.. కొన్ని సినిమాల్లో ఆ పాత్రలో ఆయన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా మాయాబజార్ (1957), దానవీరశూరకర్ణ (1977), శ్రీకృష్ణపాండవీయం (1966), శ్రీకృష్ణ విజయం (1970), శ్రీకృష్ణావతారం (1967), శ్రీకృష్ణతులాభారం (1966) సినిమాల్లో ఎన్‌టీఆర్ శ్రీకృష్ణుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే అసలు శ్రీకృష్ణుడు అనే పేరును తలచుకున్నా సరే.. ముందుగా అన్నగారి శ్రీకృష్ణుడి రూపం మన కళ్ల ముందు కదలాడుతుంది. నిజంగా ఆ పాత్రకు న్యాయం చేయదగ్గ నటుడు మాత్రం ఇప్పటి వరకు ఏ సినీ ఇండస్ట్రీలో మనకు కనిపించలేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు..!

Post a Comment

0 Comments

Close Menu