Ad Code

షియోమి నుంచి మరో ఎంఐ ప్యాడ్

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ షియోమి ఎంఐ కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల మొబైళ్లు, ట్యాబ్లెట్‌లను అందుబాటులోకి తీసుకువస్తుంది. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించి కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. Xiaomi Mi Padను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇటీవల ఈ షియోమి ఎంఐ ప్యాడ్‌ 5 చైనాలో పరిశ్రమ, సమాచారం సాంకేతిక మంత్రిత్వశాఖ నుంచి ధృవీకరణ పత్రం పొందిందింది. అయితే ఎంతో మంది వినియోగదారులు ట్యాబ్లెట్లను వినోదం కోసం, ఆఫీస్‌కు సంబంధించి పనుల కోసం ఉపయోగిస్తుంటారు. ఇందులో పెద్ద స్క్రీన్‌టచ్‌ ఉండడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. షియోమి ఎంఐ ప్యాడ్‌ను ఇష్టపడే వారితో సహా అందరు వినియోగదారులకు నచ్చే తరహాలో దీనిని రూపొందించారు. అధికారికంగా ఫీచర్స్‌ ప్రకటించక పోయినప్పటికీ కొన్ని లీక్‌ల ద్వారా తెలిసిపోతున్నాయి. ఇందులో 128/512 /జీబీ స్టోరేజీలలో లభ్యమవుతుంది. జీపీఎస్‌, వైఫై, బ్లూటూత్‌ అత్యాధునిక ఫీచర్స్‌ ఇందులో ఉన్నాయి. ఇందులో కెమెరా 20 ఎంపీ, సెకండరీ 13 మెగాఫిక్సెల్‌ ఉండవచ్చు. బ్యాటరీ 8720 ఉంది. దీని డిస్‌ప్లే 11 అంగుళాల వరకు ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ సిరీస్‌లో స్నాప్‌డ్రాగన్‌ 870ని ఉపయోగించారు. ఈ సీరిస్‌లో పలు మోడళ్ల ట్యాబ్లెట్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది షియోమి. 67w ఫాస్ట్‌ చార్జింగ్‌తో వస్తుంది. 

Post a Comment

0 Comments

Close Menu